Revanth Reddy KCR : ఇంటికో ఉద్యగం సీఎం శఠగోపం – రేవంత్
నోటిఫికేషన్లు సరే భర్తీ మాటేంటి
Revanth Reddy KCR : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారే తప్పా ఒక్క పోస్టును భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇవాళ జవాబుదారీతనం లేని స్థితికి చేరుకుందని మండిపడ్డారు.
రాష్ట్రం వస్తే లక్షలాది జాబ్స్ వస్తాయని ఆశ పడిన నిరుద్యోగుల పాలిట శాపంగా కేసీఆర్ మారారంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రధానంగా ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించి తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ లోకి రాక ముందు ఇంటికో ఉద్యగం ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు దాని గురించి ఊసే ఎత్తడం మర్చి పోయాడని ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా సీఎంకు సుదీర్ఘ లేఖ రాశారు. కేవలం ఎన్నికల కోసమే మరోసారి నిరుద్యోగులను మోసం చేసేందుకు యత్నిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రత్యేకించి పోలీసు శాఖలో భర్తీకి సంబంధించి సరైన విధానం అనుసరించ లేదన్నారు. గత ఆగస్టులో ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన తీరు దారుణంగా ఉందన్నారు.
దీన్ని బట్టి చూస్తే సీఎం కేసీఆర్ కు జాబ్స్ భర్తీ చేసే అవకాశం లేదన్నారు. అసలు సమాధానం రాయని వారికి సైతం మార్కులు కేటాయించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు దృష్టికి తీసుకు వెళ్లినా ఇంత వరకు స్పందించిన దాఖలాలు లేవన్నారు.
అభ్యర్థులకు న్యాయం చేయాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read : సీనియర్ల ధిక్కారం రేవంత్ పై ఆగ్రహం