KTR : దమ్ముంటే ‘రాజన్న’కు నిధులు తీసుకు రా
సవాల్ విసిరిన ఐటీ మంత్రి కేటీఆర్
KTR : ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి భారతీయ జనతా పార్టీ చీఫ్ , ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ ను టార్గెట్ చేశారు. దమ్ముంటే కేంద్రంలో తన ప్రభుత్వం అధికారంలో ఉందని , రాష్ట్రంలో పేరొందిన వేములాడ రాజన్న దేవాలయ అభివృద్దికి రూ. 100 కోట్లు తీసుకు రావాలని సవాల్ విసిరారు.
పొద్దస్తమానం సొల్లు కబుర్లు చెప్పడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. వ్యక్తిగతమైన దూషణలు మంచి పద్దతి కాదన్నారు. గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని దేవాలయాలను పట్టించు కోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్(KTR).
కానీ తాము పవర్ లోకి వచ్చాక గుడులను అందంగా తీర్చిదిద్దామని, కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామని తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానం ఉన్నా తాము ఏయే దేవాలయానికి ఎన్నెన్ని నిధులు ఇచ్చామో తెలియ చేసేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు కేటీఆర్. అంతే కాకుండా ఎంతో ప్రసిద్ది చెందిన వేములాడ రాజన్న దేవాలయాన్ని బద్నాం చేశారని ఆరోపించారు.
తన తండ్రి , బీఆర్ఎస్ చీఫ్ సీఎం కేసీఆర్ పెళ్లి కూడా ఇదే దేవాలయంలో జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు మంత్రి. అవాకులు , చెవాకులు పేల్చడం బంద్ చేసి ఆరోగ్యకరమైన ఆలోచనలు చేయాలని సూచించారు బండి సంజయ్ కుమార్ పటేల్(Bandi Sanjay) కు. రాజన్న గుడిని అభివృద్ది చేయడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు కేటీఆర్.
కాశీకి వేల కోట్లు ఇచ్చిన కేంద్ర సర్కార్ రాజన్నకి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.
Also Read : నన్ను తిట్టినోళ్లపై విచారణ ఏది