Amit Shah : డ్రగ్స్..టెర్రరిజం ప్రమాదం – అమిత్ షా
రాష్ట్రాలు సహకరించడం లేదని ఆరోపణ
Amit Shah : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ లో ఆయన దేశంలోని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను తప్పు పట్టారు. ప్రధానంగా దేశానికి డ్రగ్స్, తీవ్రవాదం పెను ముప్పుగా పరిణమించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం, డ్రగ్స్, తీవ్రవాదానికి సంబంధించి కొన్నిరాష్ట్రాలు సహకరించడం లేదంటూ మండిపడ్డారు. ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మాదక ద్రవ్యాల ముప్పు ఒక తీవ్రమైన సమస్యగా మారింది. ఇది తరాలను నాశనం చేస్తోంది. అంతే కాదు దేశ భవిష్యత్తుకు ప్రాణాంతకంగా తయారైందని వాపోయారు అమిత్ షా.
డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చే లాభాలను తీవ్రవాదానికి ఉపయోగిస్తున్నారని, ఒక రకంగా పెంచి పోషిస్తున్నారంటూ ఆరోపించారు కేంద్ర హొం శాఖ మంత్రి. బుధవారం లోక్ సభలో మాట్లాడిన అమిత్ షా(Amit Shah) గణాంకాలతో సహా వివరించారు. దేశంలో డ్రగ్స్ మహమ్మారి తీవ్రంగా ఉందన్నారు.
భారత్ లో ఉగ్రవాదన్ని ప్రోత్సహిస్తున్న దేశాలు డ్రగ్స్ ద్వారా వచ్చే డబ్బులను టెర్రరిజం వ్యాప్తికి ఖర్చు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పెను ప్రభావం చూపుతోందన్నారు అమిత్ చంద్ర షా. కేంద్ర ఏజెన్సీలతకు సాయం చేయని రాష్ట్రాలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులను ఎనేబుల్ చేస్తున్నాయంటూ కేంద్ర మంత్రి ఆరోపించారు.
ఎంత పెద్ద నేరస్థుడైనా వచ్చే రెండు సంవత్సరాలలో జైలుపాలు చేస్తామని హెచ్చరించారు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా.
Also Read : కేంద్రం నిర్వాకం ఆర్మీ బలహీనం