BSF Shoots Down : పంజాబ్ సరిహద్దులో పాక్ డ్రోన్ కూల్చివేత
తీరు మార్చుకోని దాయాది దేశం
BSF Shoots Down : పాకిస్తాన్ తన తీరు మార్చు కోవడం లేదు. ఇప్పటికే భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రేరేపిస్తోంది ఆ దేశం. అవసరమైన ప్రతిసారి దొంగ దెబ్బ తీసేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే పంజాబ్ సరిహద్దులో పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్ ను కూల్చి వేసింది భారత్. తాజాగా మరో డ్రోన్ ను కూల్చి వేయడం కలకలం రేపింది.
గురువారం ఉదయం 8 గంటలకు పొలం నుంచి డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని భారత సరిహద్దు దళం (బీఎస్ఎఫ్) వెల్లడించింది. అధికారికంగా ప్రకటించింది. పంజాబ్ లోని టార్న్ తరణ్ జిల్లాలో పాకిస్తాన్ వైపు నుంచి మరో డ్రోన్ చొరబాటు ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ అడ్డుకుంది.
ఫిరోజ్ పూర్ సెక్టార్ లోని భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి 8 గంటలకు బీఎస్ఎఫ్ దళాలు ఫిరోజ్ పూర్ జిల్లా టార్న్ తరణ్ లోని సరిహద్దు అవుట్ పోస్ట్ హర్బజన్ బాధ్యతాయుతమైన ప్రాంతంలో పాకిస్తాన్ నుండి అక్రమంగా చొరబాటుకు యత్నించిన డ్రోన్లను గుర్తించాయి.
ఆ తర్వాత బీఎస్ఎఫ్ దళాలు డ్రోన్ పై కాల్పులు జరిపినట్లు బీఎస్ఎఫ్(BSF Shoots Down) ఉన్నతాధికారి వెల్లడించారు. అర్ధరాత్రి అది ఎక్కడ ఉందనే దాని గురించి వెతికామని ఆనీ దొరక లేదన్నారు. ఇవాళ పొలంలో పడి ఉండటాన్ని తాము గుర్తించామని తెలిపారు.
నిషిద్ధ వస్తువులను వెలికి తీసేందుకు మరింత అన్వేషణ కొనసాగుతోందన్నారు. కాగా ఇటీవల అనేక పాకిస్తాన్ కు చెందిన డ్రోన్లను ధ్వంసం చేసింది. మరికొన్నింటిని నిర్వీర్యం చేసింది.
Also Read : సాయం కాదు పెట్టుబడి మాత్రమే – జెలెన్ స్కీ