Putin : యుద్దాన్ని ముగించ‌డం ర‌ష్యా లక్ష్యం

ర‌ష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ ప్ర‌క‌ట‌న

Putin : ర‌ష్యా దేశ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఉక్రెయిన్ పై యుద్దం ప్ర‌క‌టించాడు. పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది. యావ‌త్ ప్ర‌పంచం యుద్దాన్ని విర‌మించు కోవాల‌ని కోరింది. కానీ ప‌ట్టించు కోలేదు పుతిన్. ఇటీవ‌ల భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప‌లుమార్లు ర‌ష్యా చీఫ్ తో మాట్లాడారు.

చ‌ర్చ‌ల ద్వారానే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించు కోవాల‌ని ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీకి, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ తోను స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి. ఇదిలా ఉండ‌గా ఉన్న‌ట్టుండి ఇవాళ పుతిన్(Putin) కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. త్వ‌ర‌లోనే ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించాల‌ని అనుకుంటున్నాన‌ని స్ప‌ష్టం చేశాడు.

మా ల‌క్ష్యం మాన‌వుల్ని ఇబ్బంది పెట్ట‌డం కాదు. లేదా ఇంకొక‌రితో గిల్లి క‌జ్జాలు పెట్టుకోవ‌డం కాద‌ని పేర్కొన్నాడు. త్వర‌గానే ఈ సంఘ‌ర్ష‌ణ‌ను అంతం చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపాడు. తాము దీని కోసం ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపాడు పుతిన్. సాధ్య‌మైనంత మేర యుద్దాన్ని త్వ‌ర‌గా ముగించాల‌ని అనుకుంటున్న‌ట్లు వెల్ల‌డించాడు.

శుక్ర‌వారం ర‌ష్యా చీఫ్ మీడియాతో మాట్లాడారు. ప్ర‌స్తుతం పుతిన్ చేసిన ఈ ప్ర‌క‌ట‌న యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేసింది. ఉక్రెయిన్ వివాదానికి స‌త్వ‌ర ముగింపు ప‌ల‌క‌డ‌మే ర‌ష్యా దేశం ల‌క్ష్య‌మ‌ని వెల్ల‌డించాడు.

ఇదిలా ఉండ‌గా ర‌ష్యాను బ‌ల‌హీన ప‌ర్చేందుకు యుఎస్ ఉక్రెయిన్ ను య‌ద్ద భూమిగా ఉప‌యోగిస్తోందంటూ ఆరోపించారు పుతిన్. అన్ని వివాదాలు చ‌ర్చ‌ల‌తో ముగుస్తాయ‌ని పేర్కొన్నారు.

Also Read : పంజాబ్ స‌రిహ‌ద్దులో పాక్ డ్రోన్ కూల్చివేత

Leave A Reply

Your Email Id will not be published!