Shambhuraj Desai : ముదిరిన వివాదం అసెంబ్లీలో తీర్మానం

స‌రిహ‌ద్దు వివాదంపై మ‌రాఠా మంత్రి ప్ర‌క‌ట‌న

Shambhuraj Desai : మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల మ‌ధ్య స‌రిహ‌ద్దు వివాదం మ‌రింత ముదిరింది. నువ్వా నేనా అనేంత స్థాయికి వెళ్లింది. ఓ వైపు మ‌హారాష్ట్ర ప‌రిర‌క్ష‌ణ స‌మితి ఇంకో వైపు క‌ర్ణాట‌క రక్ష‌ణ స‌మితి ఆధ్వ‌ర్యంలో మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఎట్టి ప‌రిస్థితుల్లో ఒప్పుకునేది లేదంటూ ప్ర‌క‌ట‌న చేస్తున్నారు. మ‌రింత వేడిని రాజేస్తున్నారు.

విచిత్రం ఏమిటంటే అటు మ‌రాఠాలో ఇటు క‌న్న‌డ నాట భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ప్ర‌భుత్వాలే ఉన్నాయి. కానీ స‌రిహ‌ద్దు స‌మ‌స్య మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా త‌యారైంది. ఇదిలా ఉండ‌గా మ‌హారాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శంబురాజ్ దేశాయ్(Shambhuraj Desai) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. క‌ర్ణాట‌క‌తో స‌రిహ‌ద్దు వివాదంపై రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌చ్చే వారంలో తీర్మానం తీసుకు వ‌స్తుంద‌ని చెప్పారు.

ఇది పొరుగు రాష్ట్రం ఆమోదించిన దాని కంటే 10 రెట్లు ఎక్కువ ప్ర‌భావ వంతంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి. శుక్ర‌వారం శంబురాజ్ దేశాయ్ మీడియాతో మాట్లాడారు. ఈ మేర‌కు సోమ‌వారం రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో తీర్మానం చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించాల‌ని , పొరుగు రాష్ట్రానికి ఒక్క అంగుళం కూడా ఇవ్వ కూడ‌ద‌ని తాము తీర్మానం చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా అటు వైపు క‌ర్ణాట‌క బీజేపీ స‌ర్కార్ ఇదే ర‌క‌మైన తీర్మానం ఇప్ప‌టికే అసెంబ్లీలో చేసింది. ఇది తీవ్ర రాద్దాంతానికి దారి తీసింది. మ‌రో వైపు ఇరు రాష్ట్రాల స‌రిహ‌ద్దుల‌కు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు న‌డుస్తోంది. ఈ త‌రుణంలో ఆయా పార్టీల నాయ‌కులు మాట‌ల తూటాల‌తో మంట‌లు పుట్టిస్తున్నారు.

Also Read : రూ. 55 కోట్ల విలువైన భూమి నాది కాదు – రాజా

Leave A Reply

Your Email Id will not be published!