Rishabh Pant Rest : మానని గాయం ఆటకు దూరం
తొమ్మిది నెలల పాటు పంత్ కు రెస్ట్
Rishabh Pant Rest : ఢిల్లీ నుంచి రూర్కీకి వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై చావు నుంచి బయట పడిన భారత క్రికెటర్ రిషబ్ పంత్ మెల మెల్లగా కోలుకుంటున్నాడు. అతడిని డెహ్రాడూన్ ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. ఇప్పటికే పంత్ ఆరోగ్యం గురించి ప్రధాన మంత్రి మోదీ, ఉత్తరాఖండ్ సీఎం ధామితో పాటు బీసీసీఐ కార్యదర్శి జే షా ఆరా తీశారు.
ఆరోగ్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా తమ ప్రభుత్వమే భరిస్తుందని ఇప్పటికే ప్రకటించారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఇదిలా ఉండగా అవసరమైతే లండన్ కు పంపించేందుకు తాము రెడీగా ఉన్నామని ప్రకటించింది బీసీసీఐ. ఇదే సమయంలో ప్రధాని మోదీ పంత్ తల్లితో ఫోన్ లో మాట్లాడారు. ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
ఇదే సమయంలో కేంద్ర సర్కార్ పూర్తిగా సహాయం అందజేస్తుందని హామీ ఇచ్చారు. తాజాగా ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఇప్పట్లో మైదానంలోకి అడుగు పెట్టే పరిస్థితి లేదు రిషబ్ పంత్ కు(Rishabh Pant Rest). తలకు, కన్ను వద్ద, కాలు వద్ద మడమ కు గాయమైనట్లు సమాచారం. ఇప్పటి వరకు ముంబైలో కట్టుదిట్టమైన భద్రత మధ్య చికిత్స అందజేస్తున్నారు.
ఎప్పటికప్పుడు పంత్ ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకుంటోంది బీసీసీఐ. దాదాపు తొమ్మిది నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉండనున్నట్లు సమాచారం.
బీసీసీఐకి చెందిన వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. పంత్ రెండు మోకాళ్లతో పాటు రెండు చీల మండలకు సర్జరీ చేయనున్నట్లు సమాచారం. లండన్ కు తరలించే యోచనలో ఉంది బీసీసీఐ.
Also Read : పీసీబీ చైర్మన్ పై ఏసీసీ గుస్సా