Supreme Court : ఫిబ్రవరి 15 లోగా బదులివ్వండి – సుప్రీం
ఎల్జీబీటీక్యూ పెళ్లిళ్లపై కేంద్రానికి ఆదేశం
Supreme Court : సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్రానికి. స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు గుర్తింపు ఇవ్వాలని కోరుతూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశంలోని వివిధ కోర్టులలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని ఒకే చోటుకు చేర్చింది సుప్రీంకోర్టు(Supreme Court) . ఆయా హైకోర్టులలో పెండింగ్ లో ఉన్న వాటన్నింటిపై విచారణ చేపట్టింది.
భారత దేశ ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్ , జస్టిస్ పీ.ఎస్. నరసింహ, జస్టిస్ జేబీ పార్థీవాలాలతో కూడిన బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి స్వలింగ సంపర్కుల మ్యారేజ్ స్ కు సంబంధించి గుర్తింపుపై వచ్చే నెల ఫిబ్రవరి 15 లోగా స్పష్టమైన నివేదికతో బదులు ఇవ్వాలని ఆదేశించింది.
ఈ మేరకు అఫిడవిట్ సమర్పించాలని ఏజీకి సూచించింది. పిటిషన్లపై తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేసింది. అదే సమయంలో ఎవరైనా నేరుగా హాజరు కాక పోతే వర్చువల్ ద్వారా తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది ధర్మాసనం(Supreme Court) . సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పాటు సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ భిన్నమైన వాదనలు వినిపించారు.
చివరకు అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు పరిధిలోకి తీసుకు వస్తే బాగుంటుందని సూచించారు. దీనికి ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఓకే చెప్పింది.
ఇక హైదరాబాద్ కు చెందిన సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్ లు కూడా పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఉండడం విశేషం. వారిద్దరూ గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.
Also Read : నియామకం ఆలస్యం సుప్రీం ఆగ్రహం