Jagadanand Singh : రామ మందిరం ద్వేష పూరిత స్థలం
ఆర్జేడీ అగ్ర నేత జగదానంద్ సింగ్
Jagadanand Singh : మరోసారి అయోధ్య రామాలయం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రీయ జనతా దళ్ అగ్ర నాయకుడు జగదానంద్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ద్వేష పూరిత స్థలంలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
శ్రీరాముడిని అద్బుతమైన ప్యాలెస్ లో బంధించలేమంటూ స్పష్టం చేశారు బీహార్ ఆర్జేడీ చీఫ్. రామ మందిరాన్ని నఫ్రత్ కీ జమీన్ అంటూ పేర్కొన్నారు. విద్వేసాల భూమిలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారంటూ మండిపడ్డారు. మేం హే రాంను నమ్మే వాళ్లం కానీ జై శ్రీరాంను కాదని కుండ బద్దలు కొట్టారు.
ఇదిలా ఉండగా ఆర్జేడీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించి భారతీయ జనతా పార్టీ. అవగాహన లేకుండా మాట్లాడటం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని ఆరోపించారు బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా. శనివారం ట్వీట్ చేశారు. కీలక వ్యాఖ్యలు చేశారు. రామ మందిరంపై ఉన్న అక్కసునంతా వెళ్లగక్కుతున్నారంటూ ఆరోపించారు.
పీఎఫ్ఐ నిషేధం విషయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారంటూ గుర్తు చేశారు. దేశాన్ని విచ్చిన్నం చేసే కుట్రకు ప్రతిపక్షాలు తెర లేపాయంటూ ఆరోపించారు. దీనిపై ఆర్జేడీ చీఫ్ జగదానంద్ సింగ్ (Jagadanand Singh) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశానికి కావాల్సింది మతం కాదని కేవలం ప్రజలు , వారి బాగోగులు ముఖ్యమన్నారు.
ఇదిలా ఉండగా జగదానంద్ సింగ్ గత ఏడాది 2022 జూలై లో ఆర్ఎస్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను ఆర్ఎస్ఎస్ తో పోల్చారు.
Also Read : అమిత్ షా..మంత్రివా లేక పూజారివా