Avani Chaturvedi : ధీర వనిత అవని చతుర్వేది
యుద్ద క్రీడల్లో పాల్గొనే మొదటి మహిళ
Avani Chaturvedi : అవని చతుర్వేది హాట్ టాపిక్ గా మారారు. విదేశాల్లో యుద్ద క్రీడల్లో పాల్గొనే మొదటి మహిళా పైలట్ గా అవని చతుర్వేది నిలిచారు. మొదటి మహిళా యుద్ద పైలట్ గా ప్రకటించబడ్డారు. ఇక భారత వైమానిక దళంలో మోహనా సింగ్ జితర్వాల్ , భావనా కాంత్ తో పాటు అవనీ చతుర్వేది కూడా ఉన్నారు.
ఇదిలా ఉండగా అవని చతుర్వేది జోధ్ పూర్ లో సుఖోయ్ -30 ఫైటర్ పైలట్ గా ఉన్నారు. ఆమె ఇప్పటి దాకా భారత వైమానక దళానికి చెందిన మహిళా ఫైటర్ గా ఉన్నారు. స్క్వాడ్రన్ లీడర్ గా గుర్తింపు పొందారు అవనీ చతుర్వేది(Avani Chaturvedi) . అయితే భారత దేశం వెలుపల జరిగే వైమానిక యుద్ద క్రీడల కోసం దేశం బృందంలో భాగం కానున్నారు.
ఫైటర్ పైలట్లుగా నియమితులైన ముగ్గురు మహిళలతో కూడిన మొదటి బ్యాచ్ లో ఉన్నారు. ఆమె జపాన్ లో జరిగే యుద్ద క్రీడల్లో పాల్గొంటారు. జనవరి 16 నుంచి జపాన్ లో జరగనున్న వీర్ గార్డియన్ 2023 వ్యాయామంలో పాల్గొంటారు. హాక్ అడ్వాన్స్ డ్ జెట్ ట్రైనర్స్ పై శిక్షణ పూర్తి చేసిన తర్వాత 29 ఏళ్ల ఆమె తొలిసారిగా ఐఏఎఫ్ స్క్వాడ్రన్ సర్వీస్ లో ఎంఐజీ -21 బైసన్ ను నడిపింది అవనీ చతుర్వేది.
ఆమె మోహనా సింగ్ జితర్వాల్ , భావనా కాంత్ తో పాటు భారత వైమానిక దళంలో మొదటి మహిళా పోరాట పైలట్ గా కేంద్ర వైమానిక దళం ప్రకటించింది. ఇక అవనీ చతుర్వేది(Avani Chaturvedi) మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. ఐఏఎఫ్ లో చేరేకంటే ముందు ఆమె తెలంగాణ లోని దుండిగల్ లో ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆరు నెలల పాటు శిక్షణ పొందింది.
Also Read : ఒకప్పుడు కూలీ నేడు యుఎస్ జడ్జి