Indian Billionaires Increased : భారత్ లో పెరిగిన బిలియనీర్లు
కొందరి చేతుల్లోనే దేశ సంపద
Indian Billionaires Increased : భారత దేశంలో ధనవంతుల జాబితా పెరుగుతోంది. కరోనా దెబ్బకు కోట్లాది మంది రోడ్డు పాలైతే వ్యాపారులకు అందివచ్చిన అవకాశంగా మారింది. దేశం మొత్తం సంపదలో 40 శాతం కంటే ఎక్కువ ఒక శాతం ధనవంతులు ఉండడం గమనార్హం. ఇప్పటి వరకు 2020 నాటికి బిలీయనర్ల (ధనవంతుల) సంఖ్య 102 మంది ఉంటే గత ఏడాది 2022 నాటికి 166కు పెరిగింది(Indian Billionaires Increased).
ఈ విషయాన్ని ఆక్స్ ఫామ్ వెల్లడించింది. ఇదిలా ఉండగా భారత దేశంలోని ఒక శాతం సంపన్నులు ఇప్పుడు దేశ మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కలిగి ఉన్నారు. జనాభాలో దిగువ సగం మంది కలిసి కేవలం 3 శాతం సంపదను పంచుకుంటున్నారని ఆక్స్ ఫామ్ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం కీలక నివేదికను విడుదల చేసింది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం సందర్భంగా ఈ రిపోర్ట్ ను బహిర్గతం చేసింది. ఇండియా లోని 10 మంది ధనవంతులపై 5 శాతం పన్ను విధిస్తే పిల్లలను తిరిగి బడులకు తీసుకు వచ్చేందుకు వీలవుతుందని అభిప్రాయ పడింది.
కేవలం ఒకే ఒక్క బిలియనీర్ గౌతమ్ అదానీపై 2017 -2021 నుండి లాభాలపై ఒక్కసారి పన్ను విధిస్తే రూ. 1.79 లక్షల కోట్లను సమీకరించ వచ్చని స్పష్టం చేసింది ఆక్స్ పామ్.
ఇది సంవత్సరానికి ఐదు మిలియన్లకు పైగా భారతీయ ప్రాథమిక పాఠశాల టీచర్లను నియమించేందుకు సరి పోతుంది. దేశంలోని బిలియనీర్లు వారి మొత్తం సంపదపై 2 శాతం పన్ను విధిస్తే రాబోయే మూడేళ్లలో దేశంలో పోషకాహార లోపం ఉన్న వారి ఆకలి తీర్చేందుకు రూ. 40,423 కోట్ల ను సమకూర్చవచ్చని తెలిపింది.
Also Read : అమెజాన్ లో 18 వేల మందిపై వేటు