Share Chat Layoffs : షేర్ చాట్ లో ఉద్యోగులపై వేటు

20 శాతం ఎంప్లాయిస్ తొల‌గింపు

Share Chat Layoffs : ఐటీ , లాజిస్టిక్, ఫార్మా కంపెనీలు కోలుకోలేని షాక్ ఇస్తున్నాయి. భారీ ఎత్తున ఉద్యోగుల‌ను తొల‌గించే ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టాయి. ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ , సిస్కో, మెటా, గూగుల్ , మైక్రో సాఫ్ట్ కంపెనీల జ‌త‌కు షేర్ చాట్ చేరింది. ఈ మేర‌కు కంపెనీలో ప‌ని చేస్తున్న 20 శాతానికి పైగా జాబ‌ర్స్ ను తొల‌గించింది.

ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ సంద‌ర్భంగా అత్యంత బాధాక‌ర‌మైన విష‌య‌మ‌ని పేర్కొంది. బెంగ‌ళూరుకు చెందిన మొహ‌ల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ యాజ‌మాన్యంలోని షేర్ చాట్ , దానికి సంబంధించిన షార్ట్ వీడియోస్ యాప్ మోజ్ కూడా ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

అనిశ్చిత స్టాక్ మార్కెట్ లో అధిక వాల్యుయేష‌న్ ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉన్న పెట్టుబ‌డిదారులు, ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునేందుకు టెక్కంపెనీలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. వెంట వెంట‌నే ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నాయి(Share Chat Layoffs). సోష‌ల్ మీడియాలో టాప్ లో కొన‌సాగుతోంది షేర్ చాట్. ఇప్ప‌టి దాకా ట్విట్ట‌ర్ , గూగుల్ , వాట్సాప్ , సిస్కో, ఫేస్ బుక్ , త‌దిత‌ర కంపెనీల‌న్నీ తొల‌గింపున‌కు శ్రీ‌కారం చుట్టాయి.

ఇక షేర్ చాట్ కంపెనీ మార్కెట్ వాల్యూ ప్ర‌స్తుతం $5 బిలియ‌న్లు. దాని వెబ్ సైట్ ప్ర‌కారం 2,200 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. వీరిలో 500 మందికి పైగా సాగ‌నంపే ఛాన్స్ ఉంది. చాలా క‌ష్ట‌మైన‌, బాధాక‌ర‌మైనది ఈ నిర్ణ‌య‌మ‌ని పేర్కొంది షేర్ చాట్.

గ‌త ఆరు నెల‌లుగా బోర్డు అంత‌టా ఖ‌ర్చుల‌ను దూకుడుగా ఆప్టిమైజ్ చేసింద‌ని, మానిటైజేష‌న్ ప్ర‌య‌త్నాల‌ను వేగవంతం చేశామ‌ని కంపెనీ పేర్కొంది.

Also Read : ఫేస్ బుక్..మైక్రోసాఫ్ట్ బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!