IND vs NZ 1st ODI : ఉత్కంఠ పోరులో ఓడిన కీవీస్
ఉత్కంఠ పోరులో ఓడిన కీవీస్
IND vs NZ 1st ODI : ఉప్పల్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. చివరి వరకు నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగింది. ఒకానొక దశలో వికెట్లు కోల్పోయి భారీ తేడాతో న్యూజిలాండ్ ఓడి పోవడం ఖాయమని అనుకున్న తరుణంలో ఒక్కసారిగా బ్రాస్ వెల్ అడ్డుపడ్డాడు. విజయపు అంచుల దాకా తీసుకు వచ్చాడు.
కానీ భారత బౌలర్లు చాకచక్యంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా(IND vs NZ 1st ODI) విజయం సాధించింది. మరోసారి క్రికెట్ లో ఉన్న మజా ఏమిటో చూపించింది ఈ మ్యాచ్. క్రికెట్ అభిమానులకు పసందైన పండుగ వాతావరణాన్ని తీసుకు వచ్చేలా చేసింది. మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 349 పరుగులు చేసింది.
యువ ఆటగాడు శుభ్ మన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. డబుల్ సెంచరీతో దుమ్ము రేపాడు. తన కెరీర్ లో 19 ఇన్నింగ్స్ లలో 1,000 పరుగులు చేసి కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. అనంతరం మైదానంలోకి దిగిన న్యూజిలాండ్ టార్గెట్ ఛేదించడంలో తడబడింది. వికెట్లు పడుతున్నా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ బ్రాస్ వెల్ రెచ్చి పోయాడు.
మ్యాచ్ ను చివరి ఓవర్ దాకా తీసుకు వచ్చాడు. మరింత ఉత్కంఠను పెంచాడు. భారత జట్టులో గిల్ 208 రన్స్ చేస్తే రోహిత్ శర్మ 34, సూర్య 31, పాండ్యా 28 రన్స్ చేశారు. న్యూజిలాండ్ జట్టులో మిషెల్ బ్రాస్ వెల్ 78 బంతులు ఆడి 12 ఫోర్లు 10 సిక్సర్లతో 140 రన్స్ చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మిషెల్ శాట్నర్ 57 రన్స్ చేస్తే ఫిన్ అలెన్ 40 రన్స్ చేశారు.
Also Read : శుభ్ మన్ గిల్ ‘డబుల్’ కమాల్