Michael Bracewell : మైఖేల్ బ్రేస్ వెల్ షాన్ దార్ ఇన్నింగ్స్
78 బంతులు 140 రన్స్ 12 ఫోర్లు 10 సిక్సర్లు
Michael Bracewell : ఉప్పల్ వేదికగా భారత్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ క్రికెటర్ మైఖేల్ బ్రేస్ వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒకానొక దశలో కీవీస్ ను గెలుపు అంచుల దాకా తీసుకు వెళ్లాడు. అనూహ్యంగా కేవలం 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి దాకా పోరాట పటిమను ప్రదర్శించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. కానీ మైదానంలోకి దిగిన మైఖేల్ బ్రేస్ వెల్(Michael Bracewell) వచ్చీ రావడంతోనే పూనకం వచ్చినట్లు ఊగి పోయాడు. అద్భుతమైన షాట్లతో అలరించాడు.
కేవలం 78 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మైఖేల్ బ్రేస్ వెల్ 12 ఫోర్లు 10 సిక్సర్లతో ఏకంగా 140 రన్స్ చేశాడు. తన కెరీర్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 29 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 131 రన్స్ వద్ద ఉన్న న్యూజిలాండ్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సమయంలో మైఖేల్ బ్రేస్ వెల్ భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు.
న్యూజిలాండ్ వైస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. దీంతో మ్యాచ్ చివరి ఓవర్ దాకా సాగింది. ఎంతో ఉత్కంఠను రేపింది. నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ ఆద్యంతం రక్తి కట్టించింది. క్రికెట్ ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా తీసుకు వచ్చింది ఈ వన్డే మ్యాచ్.
ఇక న్యూజిలాండ్ తరపున రెండో అత్యధిక స్కోర్. 1996లో క్రిస్ హారిస్ 130 రన్స్ చేశాడు ఆసిస్ పై. 2003లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో శ్రీలంకపై స్కాట్ స్టైరిస్ 141 పరుగులు చేశాడు. ఐర్లాండ్ కు వ్యతిరేకంగా 82 బంతులు ఆడి 127 రన్స్ చేశాడు. నాటౌట్ గా మిగిలాడు.
Also Read : ఉత్కంఠ పోరులో ఓడిన కీవీస్