5 Lack Applications : 8,039 పోస్టులు 5 లక్షల దరఖాస్తులు
గ్రూప్ 4 పోస్టులకు దరఖాస్తుల వెల్లువ
5 Lack Applications : కోరి తెచ్చుకున్న తెలంగాణలో కష్టాలు తీరడం లేదు. ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ 2 లక్షల జాబ్స్ ఖాళీగా ఉన్నాయని తేల్చింది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు సభలో కేవలం 82 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వేస్తూ పోయారు.
కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. తెలంగాణ ఏర్పాటై ఎనిమిది ఏళ్లు పూర్తయినా కేవలం పోలీసు పోస్టులను మాత్రమే భర్తీ చేశారు సీఎం కేసీఆర్. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా జారీ చేసిన గ్రూప్ -4 పోస్టులకు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు.
ఏకంగా దరఖాస్తులు లక్షలు దాటాయి. విచిత్రం ఏమిటంటే ఇప్పటికే 5 లక్షల(5 Lack Applications) వరకు చేరుకున్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితి ఏ విధంగా ఉందో దీనిని బట్టి చూస్తే అర్థం అవుతుంది. జనవరి 18 రాత్రి వరకు ఏకంగా 4,97,056 మంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
గ్రూప్ -4లో భాగంగా మొత్తం 8,039 పోస్టులకు గత ఏడాది డిసెంబర్ 30 నుంచి అప్లికేషన్ చేసుకునేందుకు ప్రారంభం కాగా జనవరి 30 వరకు ఆఖరు తేదీ ఉంది. ఇప్పటికే 5 లక్షల దాకా వస్తే గడువు లోపు ఆ సంఖ్య 9 లక్షలు దాటినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు.
కేవలం 20 రోజుల్లోనే 5 లక్షల దరఖాస్తులు రావడం విస్తు పోయేలా చేసింది. మరో 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదని అంటున్నారు టీఎస్పీఎస్సీ అధికారులు. మరో వైపు గ్రూప్ 2కి కూడా దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా.
Also Read : ఉత్కంఠ పోరులో ఓడిన కీవీస్