R S Praveen Kumar : క‌విత అరెస్ట్ పై ఎందుకు ఆల‌స్యం

నిల‌దీసిన బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ

R S Praveen Kumar : బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(R S Praveen Kumar) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న గ‌త కొంత కాలంగా క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి స‌మ‌ర్పించిన ఛార్జ్ షీట్ లో ఎమ్మెల్సీ క‌విత పేరున్నా ఎందుకు అరెస్ట్ చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

ప్ర‌జ‌ల చెవుల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ, భార‌త రాష్ట్ర స‌మితి పూలు పెడుతున్నారంటూ ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఒక్క‌టేన‌ని కానీ పైకి మాత్రం ఆరోప‌ణ‌లు చేసుకుంటూ న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నాయంటూ మండిప‌డ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య చీక‌టి ఒప్పందం ఉంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

సీఎం కూతురు అయితే త‌ప్పు చేస్తే వ‌దిలి వేస్తారా అని నిల‌దీశారు బీఎస్పీ చీఫ్‌. బ‌హుజ‌న రాజ్యాధికార యాత్ర‌లో భాగంగా ఆర్ఎస ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఏపీ నుంచి విడి పోయిన స‌మ‌య‌మంలో తెలంగాణ‌కు మిగులు బ‌డ్జెట్ ఉండేద‌ని కానీ ఇప్పుడు అప్పుల కుప్ప‌గా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఒక ర‌కంగా న‌యా నిజాంను త‌ల‌పింప చేస్తోంద‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వ‌స్తే స‌చ్చే దిన్ రావ‌డం ఖాయ‌మ‌న్నారు. రాష్ట్రంలో బీసీల రిజ‌ర్వేష‌న్ల‌ను 50 శాతానికి పెంచాల‌ని , రూ. 5 వేల కోట్ల ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ నిధులు వెంట‌నే ఇవ్వాల‌ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ప్ర‌జ‌లు ప‌ప్పు అన్నం కోసం నానా తంటాలు ప‌డుతుంటే ప‌క్క రాష్ట్రాల నేత‌ల‌కు 17 ర‌కాల వంట‌కాలు వ‌డ్డించ‌డం ఎంత వ‌ర‌కు న్యాయ‌మ‌ని ప్ర‌శ్నించారు.

Also Read : దేశ‌మంతా ఉచిత క‌రెంట్..రైతు బంధు

Leave A Reply

Your Email Id will not be published!