Jacinda Ardern Resigns : న్యూజిలాండ్ పీఎం జెసిండా రిజైన్
సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్డెర్న్
Jacinda Ardern Resigns : న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తాను ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆమె చేసిన ప్రకటన విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండగా ఆమె పదవీ కాలం వచ్చే నెల ఫిబ్రవరి 7 లోపు ముగియనుంది.
కానీ అంత లోపే తప్పుకుంటున్నట్లు ప్రకటన చేయడం చర్చకు దారితీసింది. పార్టీ సర్వసభ్య సమావేశంలో జెసిండా ఆర్డెర్న్ పదవి నుంచి వైదొగులుతున్నట్లు స్పష్టం చేశారు. ఇది తనంతకు తానుగా తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. దీని వెనుక ఎవరి ఒత్తిళ్లు లేవని చెప్పారు.
సమావేశం ముగిసిన అనంతరం జెసిండా ఆర్డెర్న్ మీడియాతో మాట్లాడారు. ఇంత కాలం ఉన్నతమైన పదవిని నిర్వహించినందుకు ఆనందంగా ఉంది. ఎప్పుడో ఒకప్పుడు ఎంత స్థాయిలో ఉన్నా తప్పుకోవాల్సిందే. నా వరకు పొలిటికల్ పరంగా ఇదే కరెక్టు సమయమని అర్థమైంది.
అందుకే న్యూజిలాండ్ దేశానికి ప్రాతినిధ్యం వహించే ప్రధాని పదవి నుంచి వినమ్రంగా తప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నానని జెసిండా చెప్పారు. నేను కూడా మీలాంటి మనిషిని. నాకు కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి.
రాజకీయ నాయకులు కూడా మనుషులేనని గుర్తు పెట్టుకోవాలి. ప్రస్తుతం నాకు రెస్ట్ కావాలని అనుకున్నా. అందుకే ముందస్తుగానే తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు న్యూజిలాండ్ పీఎం జెసిండా ఆర్డెర్న్(Jacinda Ardern Resigns).
న్యూజిలాండ్ ప్రజలు తనను ఎల్లప్పుడూ దయతో ఉండేందుకు ప్రయత్నించే వ్యక్తిగా, నాయకురాలిగా గుర్తు పెట్టుకుంటారని చెప్పారు జెసిండా ఆర్డెర్న్.
ఈనెల 22న లేబర్ పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకుంటుందని చెప్పారు జెసిండా. 2023 అక్టోబర్ 14న సాధారణ ఎన్నికలు జరుగుతాయని, తప్పకుండా లేబర్ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read : మెరిసిన రాధికా మర్చంట్