Bandi Sanjay : వాటాల కోసమే సీఎంలు వచ్చిండ్రు
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మంలో జరిగిన భారత రాష్ట్ర సమితి సభపై స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మిగిలిన వాటాలు పంచుకునేందుకే ఇక్కడికి వచ్చారంటూ ఎద్దేవా చేశారు. ఆయన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , కేరళ సీఎం పినరయి విజయన్ పై తీవ్ర కామెంట్స్ చేశారు.
పేరుకు మీటింగ్ కానీ తాము దోచుకున్న దానిలో ఎవరెవరికి ఎంతెంత వాటా అనే విషయంపై చర్చించారని అన్నారు. ఖమ్మం సభకు వచ్చిన ఆ నలుగురు నాలుగు స్కాంలలో ఇరుక్కుని ఉన్నారని ఆరోపించారు బండి సంజయ్(Bandi Sanjay). ఒక్క నాయకుడు కూడా భారత రాష్ట్ర సమితి గురించి మాట్లాడక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
కేసీఆర్ నైజం తెలుసు కాబట్టే ముందు జాగ్రత్తగా కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, బీహార్ సీఎం నితీశ్ కుమార్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ , శివసేన బాల్ ఠాక్రే పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్ , జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ రాలేదన్నారు.
బీఆర్ఎస్ సభ గురించి పట్టించు కోలేదని జనం ఎక్కువగా ఉప్పల్ లో జరిగిన భారత్ , న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ పై ఆసక్తి చూపించారని అన్నారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనని ఒక్కటి కూడా నిజం లేదన్నారు. తెలంగాణలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్.
Also Read : కవిత అరెస్ట్ పై ఎందుకు ఆలస్యం