Wrestlers Protest : రెజ్లర్ల నిరసన కేంద్రం స్పందన
72 గంటల్లోకి నివేదిక ఇవ్వాలని ఆదేశం
Wrestlers Protest : కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైంది భారత రెజ్లర్ల సంఘం (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, యూపీకి చెందిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వ్యవహారం. ఆయన వ్యవహారశైలిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. గతంలో కొందరు అమ్మాయిలు విమర్శలు గుప్పించినా పట్టించుకోలేదు.
కానీ చివరకు భారత దేశానికి రెజ్లింగ్ విభాగంలో ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ అథ్లెట్లు వినీష్ ఫోగట్ , సాక్షి మాలిక్, పూనియా సంచలన ఆరోపణలు చేశారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఆందోళన చేపట్టారు.
నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ ధర్నా ఇవాళ కూడా కొనసాగుతోంది. మాజీ రెజ్లర్ , భారతీయ జనతా పార్టీ నాయకురాలు బబితా ఫోగట్ కూడా మహిళా రెజ్లర్ల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఆమె వారి తరపున మాట్లాడారు. ప్రభుత్వం తరపున తాను హామీ ఇస్తున్నానని మీకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటే ఉంటానని ప్రకటించింది.
గురువారం ధర్నా స్థలానికి ఆమె చేరుకున్నారు. న్యాయ పరమైన డిమాండ్ తీర్చాలని కోరారు(Wrestlers Protest) ప్రభుత్వాన్ని. ఇదిలా ఉండగా మహిళలు చేపట్టిన ఆందోళనలో దాదాపు 30 మందికి పైగా మహిళా రెజ్లర్లు పాల్గొనడం విశేషం. వీరికి అన్ని వర్గాల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. మహిళా రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించారు. డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ పై వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం దిగి వచ్చింది. 72 గంటల లోగా వివరణ ఇవ్వాలని కోరింది.
Also Read : ఎంపీ నిర్వాకం రెజ్లర్ భావోద్వేగం