Wrestlers Metoo Movement : మహిళా రెజ్లర్ల మీటూ ఉద్యమం
సోషల్ మీడియాలో ట్రెండింగ్
Wrestlers Metoo Movement : డబ్ల్యుఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ మహిళా రెజ్లర్లు చేపట్టిన ఆందోళన దేశ వ్యాప్తంగా(Wrestlers Metoo Movement) సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాప్ ట్రెండింగ్ లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలు, సంఘాలు, మేధావులు, రచయితలు, గాయనీ గాయకులు, క్రీడాకారులు, సామాజికవాదులు, రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు స్పందించారు.
మీటూ ఉద్యమాన్ని ముమ్మరం చేశారు. మహిళా రెజ్లర్లకు మద్దతు ప్రకటించారు. ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. మాజీ మహిళా రెజ్లర్ , ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నాయకురాలు బబితా ఫోగట్ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆమె ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా స్పందించారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ వ్యవహారం ఏమిటో చూడాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ను ఆదేశించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ సింగ్ పై లైంగిక వేధింపుల గురించి ప్రధానంగా ప్రస్తావించారు.
బబితా ఫోగట్ రెజ్లర్లను కలుసుకుని హామీ ఇచ్చారు. ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ , పలువురు కోచ్ లు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని వినేష్ ఫోగట్ ఆరోపించారు.
ఇదిలా ఉండగా జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ స్పందించారు. విచారణకు ఆదేశించారు.
Also Read : రెజ్లర్ల నిరసన కేంద్రం స్పందన