DCW Chief : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ తీరు సిగ్గుచేటు – స్వాతి మలివాల్
ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ ఫైర్
DCW Chief : ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత రెజ్లర్స్ సంఘం చీఫ్ , భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై(DCW Chief) మహిళా రెజ్లర్లు సంచలన ఆరోపణలు చేశారు. లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని , ఆయనతో పాటు కోచ్ లు కూడా తమను బతకనీయడం లేదంటూ వాపోయారు.
భారత దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న 30 మంది మహళా రెజ్లర్లు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. వీరిలో వినీష్ ఫోగట్ , సాక్షి మాలిక్ , పూనియా దిగ్గజ అథ్లెట్లు పాల్గొన్నారు. తాము ఈ వేధింపులకు తట్టుకోలేక పోతున్నామని ఆవేదన చెందారు. ఆందోళనకు దిగడంతో దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
విషయం తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాళ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది పూర్తిగా దిగ్బ్రాంతికరం..ఒక రకంగా సిగ్గు చేటు అని పేర్కొన్నారు. ఒకరు కాదు ఏకంగా 12 మంది అమ్మాయిలు లైంగిక దోపిడీకి పాల్పడినట్లు వాపోయారని తాను ఈ విషయాన్ని తట్టుకోలేక పోతున్నానని స్వాతి మలివాల్(Swati Maliwal) అన్నారు.
దీనిపై పూర్తిగా విచారణకు ఆదేశించడం జరిగిందని చెప్పారు. మహిళా రెజ్లర్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించామని, మహిళా కమిషన్ పూర్తిగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు కమిషన్ చైర్ పర్సన్. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఆశ్చర్య పోయాను. భారత దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన మహిళలు న్యాయం కోసం జంతర్ మంతర్ లో సమావేశం అయ్యారు. ఇది సిగ్గు చేటు అని పేర్కొన్నారు.
Also Read : మహిళా రెజ్లర్ల మీటూ ఉద్యమం