Mallikarjun Kharge : జోడో యాత్ర అంటే మోదీకి భయం
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఫైర్
Mallikarjun Kharge : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భయం పట్టుకుందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ తన రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశంలో కనీసం రైతుల గురించి ఒక్క మాట మాట్లాడలేదని నిప్పులు చెరిగారు.
దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగి పోయినా ప్రధానమంత్రి నిద్ర పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో వ్యవసాయ రంగంపై 60 శాతం ఆధారపడి బతుకుతున్నారని , కానీ మోదీ కేవలం 200 మంది ధనవంతుల ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచిస్తున్నారని ఆరోపించారు మల్లికార్జున్ ఖర్గే.
కేవలం ఎన్నికల గురించి మాత్రమే చర్చించడం దారుణమన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పూర్తి కావడానికి ఇప్పుడు భయపడుతున్నారని కాంగ్రెస్ చీఫ్ ఎద్దేవా చేశారు. పాదయాత్రలో భాగంగా పంజాబ్ లో జరిగిన ప్రసంగించారు మల్లికార్జున్ ఖర్గే. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
దేశంలోని రైతుల కష్టాలను చూడలేని ప్రధానమంత్రి ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటేనని ఎద్దేవా చేశారు. 2021లో రాజ్యసభలో గులాం నబీ ఆజాద్ కోసం మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు రైతులు చనిపోతే ఎందుకు ఎడ్వలేదని ప్రశ్నించారు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge).
మోదీ , భారతీయ జనతా పార్టీ కథలు అల్లడంలో, చెప్పడంలో ఆరి తేరారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఏఐసీసీ చీఫ్. రావణ్ అన్నప్పుడల్లా వారికి కోపం వస్తుంటుందని అని ఎద్దేవా చేశారు.
Also Read : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై విచారణ చేపట్టాలి