Modi Documentary : మోడీ డాక్యుమెంటరీపై కామెంట్స్
ఖండించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ
Modi Documentary : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారంపై ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ డాక్యుమెంటరీ చేసింది. దీనిపై సీరియస్ గా స్పందించింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ. గురువారం ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. దీని గురించి ఎక్కువగా ప్రస్తావించ దల్చుకోలేదని పేర్కొంది.
ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ డాక్యుమెంటరీ ఒక నిర్దిష్ట అపఖ్యాతి పాలైన కథనాన్ని ముందుకు తీసుకు రావడానికి రూపొందించిన ప్రచార భాగం అని షాకింగ్ కామెంట్స్ చేసింది. నిష్పాక్షికత లేక పోవడం, వలస వాదుల ఆలోచనా ధోరణి ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అరిందమ్ బాగ్చి అన్నారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ పై తయారు చేసిన డాక్యుమెంటరీని(Modi Documentary) భారత దేశంలో ఎక్కడా ఇప్పటి వరకు ప్రదర్శించ లేదని అన్నారు. అది ఏదైనా ఉంటే ఈ చిత్రం లేదా డాక్యుమెంటరీ ఈ కథనాన్ని మళ్లీ ప్రచారం చేస్తున్న ఏజెన్సీ, వ్యక్తులకు ప్రతిబింబమని పేర్కొన్నారు.
దాని వెనుక ఉన్న అసలు ఎజెండా గురించి మాకు ఆశ్చర్యం కలిగించిందని అని అన్నారు అరిందమ్ బాగ్చి. స్పష్టంగా ఇంకా చెపాలంటే తాము అలాంటి ప్రయత్నాలను గౌరవించాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి మోదీపై చేసిన ఈ డాక్యుమెంటరీపై ఆసక్తి నెలకొంది అంతటా.
ప్రస్తుతం బీబీసీ మోదీ డాక్యుమెంటరీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Also Read : జోడో యాత్ర అంటే మోదీకి భయం