Elon Musk Auctions : నాకో తిక్కుంది దానికో లెక్కుంది

ఎలోన్ మ‌స్క్ త‌లతిక్క య‌వ్వారం

Elon Musk Auctions : ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ ఏ ముహూర్తాన డైలాగ్ రాశాడో కానీ స‌రిగ్గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంటే టెస్లా సిఇఓ, చైర్మ‌న్ , ట్విట్ట‌ర్ బాస్ ఎలోన్ మ‌స్క్ కు క‌రెక్టుగా స‌రిపోతుంది. రూ. 4,400 కోట్లు పెట్టి మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు. ఆ వెంట‌నే టాప్ ఎగ్జిక్యూటివ్స్ ను సాగ‌నంపాడు.

కాస్ట్ క‌టింగ్ పేరుతో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌ను మెల మెల్ల‌గా ఇంటికి పంపిస్తున్నాడు. మ‌రో వైపు కాలిఫోర్నియాలో ట్విట్ట‌ర్ ఆఫీసు అద్దె చెల్లించ‌క పోవ‌డంతో య‌జ‌మాని కోర్టును ఆశ్ర‌యించాడు. త‌న‌కు అద్దె చెల్లించ‌కుండా ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆరోపించాడు. దీనిపై కోర్టులో కేసు న‌డుస్తోంది.

ఇక రోజు రోజుకు విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తూ దిగ్గ‌జాల‌కు కూడా అర్థం కాని రీతిలో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడు. చాలా మంది ఎలోన్ మ‌స్క్ నిర్వాకం దెబ్బ‌కు ఈ తిక్కోడిని భ‌రించ లేమంటూ చాలా మంది ఉద్యోగులు గుడ్ బై చెబున్నారు. మ‌రో వైపు టాయిలెట్స్ కు వెళ్లేందుకు వాడే పేప‌ర్స్ కూడా మీరే తెచ్చు కోవాలంటూ స్ప‌ష్టం చేయ‌డంతో దెబ్బ‌కు జాబ‌ర్స్ ల‌బోదిబోమంటున్నారు.

వేత‌నాలు ఇస్తాడో ఇవ్వ‌డో తెలియ‌క చ‌స్తున్నారు. తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. మ‌రికొంద‌రికి షాక్ ఇచ్చాడు. ఉద్యోగాల లోంచి తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ట్విట్ట‌ర్ ఆఫీసుల‌ను కూడా మూసి వేయాల‌ని నిర్ణ‌యించాడు.

తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో లోని హెడ్ క్వార్ట‌ర్స్ లో ఉన్న ట్విట్ట‌ర్ లోగోతో పాటు కాఫీ మెషీన్లు,(Elon Musk Auctions) ఫ‌ర్నీచ‌ర్, కిచెన్ సామాగ్రిని కూడా వేలానికి ఉంచాడు. మొత్తం ఇందులో 631 వస్తువుల‌ను అమ్ముడు పోవ‌డం విశేషం.

Also Read : తెలంగాణ‌లో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ హ‌బ్

Leave A Reply

Your Email Id will not be published!