Delhi LG Kejriwal : కేజ్రీవాల్ పై ఎల్జీ సక్సేనా కన్నెర్ర
ఆహ్వానించినా రాలేదని ఆరోపణ
Delhi LG Kejriwal : అసలు ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకుండాలి. ఆయన ఆధిపత్యం తమపై ఎందుకు. ఈ సక్సేనాకు ఢిల్లీతో పనేంటి అంటూ సంచలన కామెంట్స్ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi LG Kejriwal). ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. ఈ మేరకు కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ సుదీర్ఘ లేఖ రాశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు.
తాను ఎవరు అనే దానికి కేంద్రం సమాధానం చెబుతుందని, భారత రాజ్యాంగం ప్రకారమే తనను నియమించారని తెలిపారు. తన పరిమితులు ఏమిటో తనకు బాగా తెలుసు అని స్పష్టం చేశారు. ఇప్పటికే తాను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను చర్చించేందుకు రావాలని ఆహ్వానించడం జరిగిందని తెలిపారు లెఫ్టినెంట్ గవర్నర్.
సీఎం తన ప్రాపకం పెంచుకునేందుకు, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఇలా చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు ఎల్జీ. తనపై గణనీయమైన తప్పుదోవ పట్టించే, అవాస్తవ, అవమానకరమైన ప్రకటనలు చేయడం సీఎంకే చెల్లిందని ఎద్దేవా చేశారు. దీంతో మరోసారి సీఎం కేజ్రీవాల్ ఎల్జీ సక్సేనాకు మధ్య ఆధిపత్య పోరు బట్టబయలైంది.
మీరు నా గురించి లేవనెత్తిన ప్రశ్నలకు భారత రాజ్యాంగం చదివితే తెలుస్తుందన్నారు. మీరు ఎలా సీఎం అయ్యారో, అలా అయ్యేందుకు కూడా ఇదే ప్రాతిపదిక అని తెలుసుకుంటే బెటర్ అని సూచించారు వినయ్ కుమార్ సక్సేనా. తనకు వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదని స్పష్టం చేశారు.
Also Read : జమ్మూ కాశ్మీర్ లో రాహుల్ యాత్ర