Sanjay Raut Rahul Yatra : రాహుల్ తో జ‌తక‌ట్టిన సంజ‌య్ రౌత్

ఈ దేశానికి ఇలాంటి నేత అవ‌స‌రం

Sanjay Raut Rahul Yatra :  శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ స‌భ్యుడు సంజ‌య్ రౌత్ శుక్ర‌వారం రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొన్నారు. రాహుల్ యాత్ర ఇవాళ జ‌మ్మూ కాశ్మీర్లో కొన‌సాగుతోంది. ఓ వైపు వ‌ర్షం మ‌రో వైపు చ‌లి ఉన్న‌ప్ప‌టికీ వేలాది మంది రాహుల్ యాత్ర‌లో క‌దిలి వ‌చ్చారు.

భారీ ఎత్తున స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం నుండి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదురైనా సంజ‌య్ రౌత్ రాహుల్ గాంధీతో(Sanjay Raut Rahul Yatra) క‌లిసి అడుగులో అడుగు వేశారు. ఇప్ప‌టికే రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌కు సంపూర్ణ మ‌ద్ద‌తును ప్ర‌క‌టించింది శివ‌సేన పార్టీ. ఇవాళ ఉద‌యం 7 గంట‌ల‌కు యాత్ర ప్రారంభం కావాల్సి ఉండ‌గా భారీ వ‌ర్షం కార‌ణంగా గంట 15 నిమిషాలు ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది.

కాంగ్రెస్ పార్టీ జ‌మ్మూ , కాశ్మీర్ విభాగం అధ్య‌క్షుడు వికార్ రసూల్ వానీ , పూర్వీకుడు జీఏ మీర్ తో స‌హా ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు భార‌త్ జోడో యాత్ర చివ‌రి ద‌శ‌లో గాంధీ వెంట ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 140 రోజులు పూర్తి చేసుకుంది యాత్ర‌. మొత్తం 3,400 కిలోమీట‌ర్ల‌కు పైగా సాగింది. జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు కొన‌సాగుతుంది.

సంజ‌య్ రౌత్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు పాద‌యాత్ర‌లో చేర‌డంతో జ‌మ్మూ కాశ్మీర్ లోని క‌తువా జిల్లాలోని హ‌త్లి మోర్ నుండి యాత్ర తిరిగి ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు సంజ‌య్ రౌత్. రాహుల్ గాంధీని త‌న స్వ‌రం పెంచే నాయ‌కుడిగా చూస్తున్నాన‌ని అన్నారు. దేశ రాజ‌కీయాల‌లో మార్పు ప్రారంభ‌మైంద‌ని అన్నారు.

Also Read : కెప్టెన్ బానా సింగ్ దేశానికి స్పూర్తి

Leave A Reply

Your Email Id will not be published!