TS Govt Approves : ఖుష్ కబర్ పంతుళ్లు పారా హుషార్
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
TS Govt Approves : త్వరలో టీచర్లకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏది చేసినా అది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే రైతు బంధు, దళిత బంధు, ఆసరా పెన్షన్ల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించిన సర్కార్ విద్యా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించడంలో, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడంలో తాత్సారం చేస్తూ వచ్చింది.
పంతుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటి వరకు నాన్చుతూ వచ్చిన పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు(TS Govt Approves) సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు జనవరి 27 నుంచి పూర్తి పారదర్శకంగా ట్రాన్సఫర్స్, ప్రమోషన్స్ చేపట్టాలని నిర్ణయించింది. వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి విన్నవించాయి.
విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన మంత్రితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ పూర్తి పారదర్శకతతో ఉండేలా చూడాలని సర్కార్ స్పష్టం చేసింది. సమగ్ర వివరాలతో వెంటనే షెడ్యూల్ ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా టీచర్ల బదిలీలకు శ్రీకారం చుట్టనుంది సర్కార్. ఏమాత్రం సాఫ్ట్ వేర్ లో లోపాలు లేకుండా చూడాలని లేక పోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇదిలా ఉండగా పంతుళ్లు పాఠాలు చెప్పడం మానేసి పైరవీలలో మునిగి పోయారన్న విమర్శలు లేక పోలేదు.
Also Read : దేశమంతా ఉచిత కరెంట్..రైతు బంధు