Nagoba Jatara : అంబురం నాగోబా జాతర సంబురం
నాగోబా జాతర ప్రారంభం
Nagoba Jatara : కోట్లాది ఆదివాసీలు దైవంగా భావించే కొలిచే నాగోబా జాతర(Nagoba Jatara) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నూతనంగా నిర్మించిన గుడిలో అర్ధరాత్రి నాగోబా విగ్రహానికి పవిత్రమైన గంగా జలంతో అభిషేకం చేశారు. మెస్రం వంశీయులు జాతరను ప్రారంభించారు. మురాడి వద్ద తొలిగా పూజలు చేశారు. అనంతరం కేస్లాపూర్ ఊరు నుంచి సంప్రదాయ వాయిద్యాలతో నాగోబా ఉత్సవ విగ్రహాన్ని ఆలయం వద్దకు తీసుకు వచ్చారు.
కోనేరు నుంచి నీళ్లను సిరికొండ నుంచి తీసుకు వచ్చిన మట్టి కుండల్లో మహిళలు పోశారు. మెస్రం వంశానికి చెందిన అల్లుళ్లు గుడి వద్ద ఉన్న పాత పుట్టను తొలగించారు. మహిళలు కొత్త పుట్టను తయారు చేశారు. ఈ సంప్రదాయం అనాది నుంచి కొనసాగుతూ వస్తోంది.
ఆ తర్వాత నాగోబా గుడి వెనుకాల ఉన్న పెర్సపేన్ , బాన్ పేన్ లకు పూజలు చేశారు..నైవేద్యం సమర్పించారు. కొత్తగా పెళ్లి చేసుకున్న మహిళలు తెల్లటి వస్త్రాలు ధరించి పరిచయ కార్యక్రమం (బేటింగ్ )లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెస్రం వంశానికి చెందిన పెద్దల నుంచి ఆశీర్వాదం అందుకున్నారు.
నాగోబా జాతర(Nagoba Jatara) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండగా ప్రత్యేక విమానంలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా విచ్చేశారు. బీజేపీ స్టేట్ చీఫ్ తో కలిసి నాగోబాకు చేరుకుంటారు.
నాగోబా ను దర్శనం చేసుకుని పూజలు చేస్తారు. పూజల అనంతరం ఇక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు అర్జున్ ముండా.
Also Read : టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి