Arvind Kejriwal : విదేశాల‌కు రెండుసార్లు వెళ్లానంతే

సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కామెంట్స్

Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్, సీఎంకు మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది. మెరుగైన విద్య కోసం ఢిల్లీలో ప‌ని చేస్తున్న టీచ‌ర్ల‌కు ఫిన్ లాండ్, కేంబ్రిడ్జ్ , సింగ‌పూర్ ల‌లో లో శిక్ష‌ణ ఇప్పిస్తున్నారు సీఎం. ఈ సంద‌ర్భంగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఢిల్లీకి వ‌చ్చిన టీచ‌ర్ల‌తో స‌మావేశం అయ్యారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).

ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్న తాను కేవ‌లం రెండుసార్లు మాత్ర‌మే విదేశాల‌కు వెళ్ల‌గ‌లిగాన‌ని కానీ మీరు మాత్రం అదృష్ట‌వంతుల‌ని పేర్కొన్నారు. ఎందుకంటే మీకు ఆ అవ‌కాశం వ‌చ్చింద‌ని, త‌న‌కు రాలేద‌న్నారు. తాను ఐఐటీలో చ‌దువుకున్నా విదేశాల‌కు వెళ్ల‌లేక పోయాయ‌న‌ని తెలిపారు.

కానీ సీఎంగా కొలువు తీరాక రెండుసార్లు మాత్ర‌మే వెళ్లేందుకు అవ‌కాశం ల‌భించింద‌ని పేర్కొన్నారు. పాల‌నా ప‌రంగా బిజీగా ఉండ‌డం వ‌ల్ల అది సాధ్యం కాలేద‌ని చెప్పారు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) . గ‌తంలో ఉన్న పాల‌కులు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప‌ని చేస్తున్న వారికి విదేశాల్లో శిక్ష‌ణ అవ‌స‌రం లేద‌న్న అభిప్రాయం క‌లిగి ఉండేవార‌ని కానీ తాము దాని గురించి పట్టించు కోలేద‌న్నారు సీఎం.

టీచ‌ర్ల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డం కంటే మంచి పెట్టుబ‌డి ఇంకెక్క‌డా లేద‌న్నారు. మీరంతా ప్ర‌పంచ అనుభ‌వాన్ని పొందాల‌ని కోరుకుంటున్నా. మ‌న ప్ర‌భుత్వ బ‌డులు అంత‌ర్జాతీయ పాఠ‌శాల‌ల కంటే మెరుగ్గా ఉండాల‌ని పిలుపునిచ్చారు అర‌వింద్ కేజ్రీవాల్. నాయ‌కులు విద్య‌పై ఫోక‌స్ పెట్టి ఉంటే చాలా ఏళ్ల కింద‌టే భార‌త్ విద్యా విప్లవాన్ని చూసి ఉండేద‌న్నారు కేజ్రీవాల్.

Also Read : విద్యా రంగంపై మోడీ వివ‌క్ష – ఖ‌ర్గే

Leave A Reply

Your Email Id will not be published!