PM Modi : ఆ ద్వీపాలు ఇక పరమచక్ర విజేతలు
నివాళి అర్పించనున్న ప్రధాని మోడీ
PM Modi : నరేంద్ర మోదీ అమర వీరులకు నివాళులు అర్పించనున్నారు. ఇవాళ పరాక్రమ్ దివస్. కేంద్ర ప్రభుత్వం దివంగత నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతిని పరాక్రమ్ దివస్ గా నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా సోమవారం అండమాన్ నికోబార్ దీవులకు పరమ వీర చక్ర బిరుదు పొందిన వారి పేర్లను పెట్టనున్నారు నరేంద్ర మోడీ.
ఇక నుంచి ఆ ద్వీపాలన్నీ పరమ వీర చక్ర విజేతలుగా పిలుస్తారు. ప్రధాన మంత్రి(PM Modi) ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
నరేంద్ర మోదీ పీఎంగా 2014లో కొలువు తీరారు. రెండోసారి ఆయనే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ప్రత్యేకంగా నివాళులు అర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నరేంద్ర మోడీ.
ఇందులో భాగంగా 2021లో నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్ గా నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించింది. ఆనాటి నుంచి ప్రతి ఏటా జనవరి 23ను పరాక్రమ్ దివస్ నిర్వహిస్తూ వస్తున్నారు. 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను అండమాన్ లోని 21 దీవులకు వారి పేర్లను పెట్టాలని నిర్ణయించారు.
వారిలో మేజర్ సోమనాథ్ శర్మ, కరమ్ సింగ్ , రామ రఘోబా రాణే, నాయక్ జాదునాథ్ సింగ్ , సింగ్ , కెప్టెన్ సలారియా, ధన్ సింగ్ థాపా, జోగిందర్ సింగ్ , షైతాన్ సింగ్ , అబ్దుల్ హమీద్ , తారాపూర్ , లాన్స్ నాయక్ ఆల్బర్డ్ ఎక్కా, హోసియార్ సింగ్ , నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్ , ఖేత్రపాల్ , పరమేశ్వరన్ , బనా సింగ్ , విక్రమ్ బాత్రా, కుమార్ పాండే, సంజయ్ కుమార్ , యోగేంద్ర సింగ్ యాదవ్ ఉన్నారు.
Also Read : పవన్ ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు