PM Narendra Modi : సహకారం సాంకేతిక నైపుణ్యం అవసరం
రాష్ట్ర పోలీసులు..కేంద్ర ఏజెన్సీల మధ్య సమన్వయం
PM Narendra Modi : రాష్ట్ర పోలీసు బలగాలు, కేంద్ర ఏజెన్సీల మధ్య మెరుగైన సహకారం ఉండాల్సిన అవసరం ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇదే సమయంలో సామర్థ్యాలను పెంచు కోవడానికి సమన్వయంతో పాటు సాంకేతిక నైపుణ్యం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఉన్న సాంప్రదాయక విధానాలను మరింత మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ప్రధానమంత్రి.
డైరెక్టర్ జనరల్స్ , ఇన్సెపెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ 57వ అఖిల భారత కాన్ఫరెన్స్ లో నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వాడుకలో లేని క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని, రాష్ట్రాలలో అంతటా పోలీసు సంస్థలకు ప్రమాణాలను నిర్మించాలని సిఫార్సు చేశారు ప్రధానమంత్రి. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించు కోవడం అన్నది ముఖ్యం కావాలన్నారు.
అటు రాష్ట్రాలు ఇటు కేంద్ర ఏజెన్సీలు తరుచూ సహకారం కలిగి ఉండేందుకు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు ప్రధాని. పోలీసు బలగాలు అభివృద్ది చెందుతున్న సాంకేతికతలో శిక్షణ పొందాలని స్పష్టం చేశారు. ఏజెన్సీలు అంతటా డేటా మార్పిడిని సులభతరం చేసేందుకు నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్ వర్క్ కు సంబంధించిన ప్రాధాన్యత గురించి మరోసారి ప్రస్తావించారు నరేంద్ర మోదీ(PM Narendra Modi) .
జైలు నిర్వహణ గురించి కూడా ప్రస్తావించారు ప్రధానమంత్రి. జైలు సంస్కరణలకు శ్రీకారం చుట్టాలన్నారు. అభివృద్ది చెందుతున్న సవాళ్లను చర్చించేందుకు , ఉత్తమ పద్దతులను అభివృద్ది చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలలో డీజీపీ, ఐజీపీ సమావేశాలను నిర్వహించాలని స్పష్టం చేశారు నరేంద్ర మోడీ.
Also Read : కేంద్రం నిషేధం ప్రతిపక్షం ఆగ్రహం