TS Secretariat : ఫిబ్ర‌వ‌రి 17న స‌చివాల‌యం ప్రారంభోత్స‌వం

రానున్న జాతీయ స్థాయి నేత‌లు , ప్ర‌ముఖులు

TS Secretariat : అత్యంత ఆధునిక‌మైన సౌక‌ర్యాల‌తో భారీ ఎత్తున ఖ‌ర్చు చేసి నిర్మించిన తెలంగాణ స‌చివాల‌యం ముహూర్తానికి సిద్ద‌మైంది. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ ఖ‌రారు చేశారు. వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి 17న ప్రారంభించ‌నున్నారు. జాతీయ నేత‌ల‌కు ఆహ్వానం పంపించారు. ఆరోజు ఉద‌యం 11.30 గంట‌ల‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.

ముందుగా వాస్తు పూజ‌, చండీ యాగం, సుద‌ర్శ‌న యాగం నిర్వ‌హిస్తారు. వేద పండితులు, స్వాములు, ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతారు. ఈ కార్య‌క్రమానికి త‌మిళ‌న నాడు సీఎం ఎంకే స్టాలిర్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ , అంబేద్క‌ర్ మ‌న‌వ‌డు ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ ప్ర‌త్యేక ఆహ్వానితులుగా రానున్నారు.

ఇప్ప‌టికే తెలంగాణ స‌చివాల‌యానికి(TS Secretariat) డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ పేరు పెట్టారు సీఎం కేసీఆర్. సీఎం చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది. ఉద‌యం 11.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల మ‌ధ్య స‌చివాల‌యం ప్రారంభోత్స‌వ కార్య‌క్రమం ఉంటుంది. బీహార్ సీఎం నితీశ్ కుమార్ , డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ , జేడీయూ చీఫ్ ల‌ల‌న్ సింగ్ కూడా హాజ‌రవుతార‌ని తెలిపారు.

ఇదిలా ఉండ‌గా తెలంగాణ స‌చివాల‌యం ప్రారంభం అనంత‌రం సికింద్రాబాద్ లోని ప‌రేడ్ గ్రౌండ్స్ లో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ ఆధ్వ‌ర్యంలో భారీ బహిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. కాగా రూ. 617 కోట్ల‌తో స‌చివాల‌యాన్ని నిర్మించారు. మొద‌ట్లో 212 కోట్లు అన్నారు. ఆ త‌ర్వాత అంచ‌నాలు పెంచుతూ పోయారు. ఇంకా పూర్తి కాలేద‌ని తెలిసింది. ఇదిలా ఉండ‌గా సీఎం కేసీఆర్ మంగ‌ళ‌వారం స‌చివాల‌యాన్ని సంద‌ర్శించారు.

Also Read : పొత్తుకు సిద్దం కాదంటే ఒంట‌రి పోరాటం

Leave A Reply

Your Email Id will not be published!