AP AAP : ఏపీలో రాజకీయాలు మరింత వేడిని కలిగిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నా ప్రచారం ప్రారంభించాయి. పవన్ కళ్యాణ్ వారాహి రథానికి పూజలు చేశారు. ఆయన కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మరో వైపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ అంటూ ఏపీలో పర్యటిస్తున్నారు. ర్యాలీలు, సభలతో హోరెత్తిస్తున్నారు.
ఇంకో వైపు చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ యువ గళం పేరుతో పాదయాత్ర కు శ్రీకారం చుట్టారు. జనవరి 27 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఇప్పటికే తెలంగాణలో కీలకంగా మారిన ఆ పార్టీ ఏపీలో(AP AAP) ఫోకస్ పెడుతున్నట్లు ఇన్‌చార్జ్ మణి నాయుడు వెల్లడించారు. 2024లో జరిగే ఎన్నికలలో ఆప్ పోటీకి దిగుతుందని చెప్పారు.
తాము ఏ పార్టీతో పొత్తు ఉండదని పేర్కొన్నారు. గత 9 నెలల నుంచి తమ పార్టీ ఏపీలో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నదని తెలిపారు మణి నాయుడు. ఏపీ వాసులు మార్పు కోరుకుంటున్నారని ఆ దిశగా తాము ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. దేశ మంతటా ఆప్ కు ఆదరణ పెరుగుతోందని తెలిపారు.
ఏపీలో నెలకొన్న సమస్యలను గుర్తించామని వాటిని తమ పార్టీ ప్రణాళికలో పొందు పరిచి అమలు చేసేందుకు పోరాడుతామని మణి నాయుడు అన్నారు. బడులు, ఆస్పత్రులు బాగుండాలని ఆప్(AP AAP) కోరుకుంటుందన్నారు మణి నాయుడు.
Also Read : పొత్తుకు సిద్దం కాదంటే ఒంటరి పోరాటం