Rakhi Sawant Bombay HC : రాఖీ సావంత్ ను అరెస్ట్ చేయొద్దు

ఫిబ్ర‌వ‌రి 1 వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దు

Rakhi Sawant Bombay HC : బాలీవుడ్ న‌టి రాఖీ సావంత్ కు ఊర‌ట ల‌భించింది. ఫిబ్ర‌వ‌రి 1 వ‌ర‌కు ఆమెపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దంటూ కోర్టు పోలీసుల‌ను ఆదేశించింది. మోడ‌ల్ , న‌టి రాఖీ సావంత్ పై అనుచిత వీడియోలు, ఫోటోలు తీశార‌ని, అది వైర‌ల్ గా మారింద‌ని ఆరోపిస్తూ జ‌న‌వ‌రి 16న ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు జ‌న‌వ‌రి 19న రాఖీ సావంత్ పై ముంబై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఆమెకు వ్య‌తిరేకంగా మోడ‌ల్ దాఖ‌లు చేసిన కేసులో రాఖీ సావంత్ పై బ‌ల‌వంత‌పు చ‌ర్య తీసుకోవ‌ద్దంటూ , ఇది వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి 1 వ‌ర‌కు వ‌ర్తిస్తుంద‌ని బాంబే హైకోర్టు పోలీసుల‌ను ఆదేశించింది. త‌న‌పై అకార‌ణంగా ఫిర్యాదు చేశారంటూ న‌టి రాఖీ సావంత్ కోర్టును ఆశ్ర‌యించింది. విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ఈ మేర‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

సావంత్ ముంద‌స్తు(Rakhi Sawant Bombay HC) బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించారు. ప్రాసిక్యూష‌న్ ప్ర‌కారం రాఖీ సావంత్ ఫిర్యాదుదారు కొన్ని వీడియోల‌ను మీడియాకు చూపించింది. జ‌స్టిస్ ఎంఎస్ కార్నిక్ ధ‌ర్మాస‌నం ఈ వ్యాజ్యాన్ని వాయిదా వేసింది. ఫిర్యాదు మేర‌కు రాఖీ సావంత్ , అడ్వ‌కేట్ ఫ‌ల్గుణి బ్ర‌హ్మ‌భ‌ట్ ల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు ముంబై పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా ముంబై సెష‌న్స్ కోర్టు బుధ‌వారం ఆమె ముంద‌స్తు బెయిల్ ను తిర‌స్క‌రించ‌డంతో గురువారం రాఖీ సావంత్ ను అంబోలీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంబే హైకోర్టు ఆదేశించ‌డంతో ఆమెను వ‌ద‌ల‌క త‌ప్ప‌లేదు. దీంతో ఊప‌రి పీల్చుకుంది న‌టి.

Also Read : కేంద్రం అభ్యంత‌రం సుప్రీం బ‌హిర్గ‌తం

Leave A Reply

Your Email Id will not be published!