PM Modi Egypt President : ఈజిప్టుతో వ్యూహాత్మ‌క భాగస్వామ్యం

అబ్దెల్ ఫ‌త్తా ఎల్ సీసీతో మోడీ భేటీ

PM Modi Egypt President : గ‌త కొన్నేళ్లుగా ఈజిప్టు, భార‌త్ క‌లిసి మెలిసి ఉన్నాయ‌ని ఇదే ట్రెండ్ కొన‌సాగుతూ ఉండాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు తెలిపారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ. రిప‌బ్లిక్ డే వేడుక‌ల్లో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా విచ్చేశారు భార‌త్ కు ఈజిప్టు దేశ అధ్య‌క్షుడు అబ్దెల్ ఫ‌త్తా ఎల్ సీసీ. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ఆయ‌న‌తో భేటీ అయ్యారు.

ఇరువురు వివిధ కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ. ఈజిప్టుతో భార‌త్ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని(PM Modi Egypt President) క‌లిగి ఉంటుంద‌న్నారు. రాబోయే రోజుల్లో మ‌రింత బంధం బ‌లోపేతం కావ‌డానికి భార‌త్, ఈజిప్టు దేశాలు కృషి చేస్తాయ‌ని చెప్పారు మోడీ.

ఇందులో భాగంగా భార‌త్ , ఈజిప్టు వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం కింద రాజ‌కీయాలు, భ‌ద్ర‌త‌, ఆర్థిక శాస్త్రం, సైన్స్ రంగాల‌లో ఎక్కువ‌గా స‌హ‌కారం పెంపొందించు కోవాల‌ని నిర్ణ‌యించినట్లు తెలిపారు ప్ర‌ధాన‌మంత్రి. అంతే కాకుండా భార‌త దేశం నాయ‌క‌త్వం వ‌హిస్తున్న జీ20 లో కూడా భాగం కావాల‌ని ఈజిప్టు చీఫ్ తో కోరిన‌ట్లు తెలిపారు మోడీ.

సైబ‌ర్ సెక్యూరిటీ, క‌ల్చ‌ర్ , ఐటీ, యూత్ మ్యార్స్ , బ్రాడ్ కాస్టింగ్ రంగాల‌లో భార‌త్ , ఈజిప్టు మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందాలు చేసుకున్నాయి. ఇరు దేశాల మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డి 75 ఏళ్లు అవుతున్న సంద‌ర్భంగా పోస్ట‌ల్ స్టాంపు విడుద‌ల చేశారు.

ఈ స్మార‌క పోస్ట‌ల్ స్టాంప్ ను కేంద్ర రైల్వేలు, క‌మ్యూనికేష‌న్స , ఐటీ మినిష్ట‌ర్ అశ్విని వైష్ణవ్ , ఈజిప్ట్ క‌మ్యూనికేష‌న్స్ , ఐటీ మంత్రి డాక్ట‌ర్ స‌మీహ్ త‌లాత్ మ‌ధ్య మార్చుకున్నారు.

Also Read : కాంగ్రెస్ కు అనిల్ కే ఆంటోనీ గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!