Tamilisai KCR : ప్రభుత్వ నిర్వాకం రాజ్యాంగానికి అవమానం
రాజ్యాంగాన్ని కావాలని అవమానించారు
Tamilisai KCR : రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ మధ్య వివాదం ముదిరింది. గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. ఆమె ఏకంగా సీఎం కేసీఆర్ ను(Tamilisai KCR) టార్గెట్ చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కావాలని అగౌరవ పరిచారని ఆరోపించారు. ఈ వ్యవహారం , సీఎం అనుసరించిన విధానం, ప్రభుత్వం తన పట్ల ప్రదర్శించిన వైఖరి రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు.
సర్కార్ తీరు గురించి పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేశానని చెప్పారు గవర్నర్. గణతంత్ర వేడుకలు జరప కూడదని ముందుగానే నిర్ణయం తీసుకుందన్నారు. అందుకే కుంటి సాకులు చెప్పి తప్పించుకుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు తమళి సై సౌందర రాజన్. రాజ్ భవన్ లో భారతీయ జెండాను ఎగుర వేసిన అనంతరం పుదుచ్చేరికి తన స్వంత ఖర్చులతో విమానంలో వెళ్లారు.
అక్కడ భారత పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం తమిళి సై సౌందర రాజన్ మీడియాతో మాట్లాడారు. సీఎంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంచలన ఆరోపణలు చేశారు. రిపబ్లిక్ వేడుకలు జరపాలని గత రెండు నెలల కిందటే తాను రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశానన్నారు.
దానికి ఇప్పటి వరకు జవాబు ఇవ్వలేదన్నారు. ప్రధానంగా కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సైతం పక్కన పెట్టిందన్నారు.ఇదిలా ఉండగా గవర్నర్ తమిళిసై కావాలని తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది.
Also Read : 106 మందికి పద్మ పురస్కారాలు