Amit Shah Tour : కన్నడ నాట అమిత్ షా రోడ్ షో
28న కిత్తూరులో పాల్గొనే ఛాన్స్
Amit Shah Tour : కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొలువు తీరిన ప్రభుత్వం తిరిగి పవర్ లోకి వచ్చేలా ప్లాన్ చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. బీజేపీలో ప్రస్తుతం షా ట్రబుల్ షూటర్ గా పేరొందారు. ఈ ఏడాదిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
అవినీతి, అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఇదే పార్టీకి చెందిన మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ప్రతి ఓటుకు రూ. 6,000 ఇస్తామంటూ ప్రకటించాడు. ఈ తరుణంలో అమిత్ షా(Amit Shah Tour) జనవరి 28న శనివారం కర్ణాటకలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ఇందులో భాగంగా కర్ణాటక లోని హుబ్బల్లి – ధార్వాడ్ , బెలగావిలో పర్యటిస్తారు అమిత్ చంద్ర షా. వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే రోడ్ షోలో పాలు పంచుకుంటారు అమిత్ షా. ఇదిలా ఉండగా గత ఏడాది 2022 డిసెంబర్ చివరి నెలలో మాండ్య, బెంగళూరులలో పర్యటించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈసారి కూడా తాము పవర్ లోకి రావడం ఖాయమన్నారు అమత్ షా. కాగా ఈనెల 27న హుబ్బల్లికి వస్తారు..ఇక్కడే బస చేస్తారు. బీవీబీ కాలేజీ 75వ వార్షికోత్సవం , ఇండోర్ స్టేడియం ప్రారంభిస్తారు. ఆపై ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి శంకుస్థాపన చేస్తారని కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి మహేష్ టెంగింకై చెప్పారు.
Also Read : బహిష్కరణ సంస్కృతి ప్రమాదం – ఠాకూర్