CM KCR : కేంద్రంపై యుద్దం త‌ప్ప‌దు పోరాటం

మోదీపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

CM KCR : కేంద్రంపై మ‌రోసారి నిప్పులు చెరిగారు భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ చీఫ్‌, తెలంగాణ సీఎం కేసీఆర్. రైతులు పోరాటం చేసినా ఫ‌లితం లేకుండా పోయింద‌న్నారు. మోడీ స‌ర్కార్ కు రైతులంటే చుల‌క‌న భావం ఉంద‌న్నారు. అందుకే వారి గురించి ఊసెత్త‌డం లేదంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఈ దేశంలో అన్నం పెట్టే అన్న‌దాత‌ల ప‌ట్ల కావాల‌ని కేంద్రం వివ‌క్ష చూపుతోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు కేసీఆర్(CM KCR).

క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఇందులో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించారు సీఎం. రాబోయే కాలంలో రైతులే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దేశంలో అపార‌మైన వ‌న‌రులు, వ‌స‌తులు ఉన్నాయి. కానీ వాటిని గుర్తించి స‌ద్వినియోగం చేసుకునే ప‌రిస్థితి లేకుండా పోయింద‌న్నారు.

అస‌లు పీఎంకు సోయి అనేది ఉందా అని ప్ర‌శ్నించారు కేసీఆర్. దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చి 75 ఏళ్ల‌వుతోంది. ఆజాద్ కీ అమృత్ మ‌హోత్స‌వ్ పేరుతో ఉత్స‌వాలు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నాం. కానీ నేటికీ రైతుల‌కు భ‌ద్ర‌త లేకుండా పోయింద‌న్నారు. ఇప్ప‌టికీ ఇంకా తాగు, సాగు నీళ్ల కోసం కోట్లాది జ‌నం ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారంటూ మండిప‌డ్డారు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం మోడీనే అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం(CM KCR). ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఒడిశా మాజీ సీఎం గిరిధ‌ర్ గొమాంగ్ తో పాటు ప‌లువురు నాయ‌కులు కేసీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సంద‌ర్భంగా కీల‌క ప్ర‌సంగం చేశారు సీఎం. హ‌లం ప‌ట్ట‌డ‌మే కాదు క‌దం తొక్కాల‌ని రైతుల‌కు పిలుపునిచ్చారు కేసీఆర్.

Also Read : మ‌రో 2,391 పోస్టుల‌కు ప‌చ్చ జెండా

Leave A Reply

Your Email Id will not be published!