PM Modi Visits : ‘గుజ్జర్’ ను సందర్శించనున్న మోడీ
రాజకీయం కానే కాదంటున్న బీజేపీ
PM Modi Visits : రాజస్థాన్ లో రాజకీయ వేడి ఊపందుకుంది. ఇప్పటికే గుజరాత్ లో భారీ విజయాన్ని నమోదు చేసింది భారతీయ జనతా పార్టీ. త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ రాజస్థాన్ లోని గుజ్జర్ ప్రాంతాన్ని సందర్శించనున్నారు.
గతంలో జరిగిన ఎన్నికల్లో గుజ్జర్ సామాజిక వర్గానికి చెందిన 9 మందికి బీజేపీ టికెట్లు ఇచ్చింది. భగవాన్ దేవ్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి మలసేరిని కూడా సందర్శించనున్నారు నరేంద్ర మోడీ(PM Modi Visits). ఈ పర్యటనను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించినప్పటికీ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు 10 నెలల ముందు ఇది వస్తుంది.
మలసేరి భగవాన్ దేవ్ నారాయణ్ జన్మ స్థలం . ఈ ప్రాంతంలో గొప్పగా ఆరాధిస్తారు. ముఖ్యంగా గుజ్జర్ల కమ్యూనిటీ భారీగా కొలువు తీరి ఉంది. భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ సామాజిక వర్గానికి ఎన్నికలకు ముఖ్యమైన మద్దతు కూడగట్టేందుకు యత్నిస్తున్నాయి.
సచిన్ పైలట్ రాజస్థాన్ తొలి గుజ్జర్ సీఎం అవుతాడనే ఆశతో గుజ్జర్ల ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లడంతో వారంతా ఓడి పోయారు. మత పరమైన కార్యక్రమం ద్వారా గుజ్జర్ల ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా చేరువయ్యేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది.
ఇదిలా ఉండగా ప్రతి దానిని రాజకీయ కోణంతో చూడవద్దని కోరారు బీజేపీ రాజస్థాన్ చీఫ్ సతీష్ పునియా. గుజ్జర్లు రాష్ట్రంలో 9 శాతం నుండి 12 శాతం దాకా ఉన్నారు. తూర్పు రాజస్థాన్ లోని 40 నుండి 50 అసెంబ్లీ స్థానాల్లో గణనీయమైన ప్రభావం చూపనున్నారు.
Also Read : రాహుల్ గాంధీ ఆరోపణలు అబద్దం