BRO LAC Ladakh Road : చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
లడఖ్ లో భారీ రహదారి నిర్మాణం
BRO LAC Ladakh Road : పదే పదే చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇటీవల లడఖ్ సరిహద్దు వద్ద భారీగా దళాలను మోహరించింది. భారత్, చైనా దేశాలకు చెందిన దళాలు దాడులకు దిగాయి. ఇండో చైనీస్ సరిహద్దు వద్ద కొత్తగా ప్రాజెక్టులు, రోడ్లు నిర్మానాలు చేపడుతూ కవ్వింపులకు పాల్పడుతోంది చైనా.
పదే పదే దాడులకు దిగుతూ యుద్దానికి సై అంటోంది చైనా. లడఖ్ లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంట 135 కిలోమీటర్ల పొడవునా హైవే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది భారత్. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) కసరత్తు(BRO LAC Ladakh Road) ప్రారంభించింది. ఇందుకు సంబంధించి జాతీయ రహదారి నిర్మాణం కోసం బిడ్ ను ఆహ్వానించింది.
ఈ హైవేను రెండేళ్లలో పూర్తి చేయనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. లడఖ్ లో ఎల్ఏసీ వెంబడి బార్డర్ కు దగ్గరగా ఉన్న చషుల్ నుండి డేమ్ చుక్ దాకా దీనిని భారీ ఎత్తున నిర్మించనున్నారు. చైనా, భారత్ దేశాల మధ్య పాంగాంగ్ సరస్సు కు దక్షిణాన ఉన్న చషుల్ నుంచి ఉత్తరాన సరిహద్దుకు సమీపంలో ఉన్న చవరి భారతీయ విలేజ్ డేమ్ చుక్ వరకూ హైవే ఏర్పాటు కానుంది.
మధ్యలో డూంగ్రీ , ఫక్చే ప్రాంతాలను ఇది అనుసంధానం చేయనుంది. ఇదిలా ఉండగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం మధ్య దూరం తగ్గేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా 135 కిలోమీటర్ల మేర వచ్చే రెండేళ్లలో దీన్ని నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది.
రోడ్డు నిర్మాణానికి అప్పటి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 2016 మార్చిలో ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు యూనియన్ టెరిటరీలోని చాంగ్ తంగ్ కోల్డ్ ఎడారి వన్య ప్రాణాల అభయారణ్యం గుండా వెళుతుంది. జాతీయ వన్య ప్రాణుల బోర్డు కి హైవే నిర్మించాలనే ప్రతిపాదన సిఫార్సు చేశారు.
Also Read : వ్యోమగామి రాజా చారికి అరుదైన గౌరవం