Mehbooba Mufti Rahul Yatra : రాహుల్ యాత్రలో ‘ముఫ్తీ’
భారీ భద్రత నడుమ రాహుల్ కదలిక
Mehbooba Mufti Rahul Yatra : భారీ భద్రత నడుమ రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. నిన్న అర్ధాంతరంగా భద్రతా వైఫల్యం కారణంగా నిలిపి వేసింది కాంగ్రెస్ పార్టీ. జనం ఎక్కువ మంది రావడంతో తాము సెక్యూరిటీని తొలగించాల్సి వచ్చిందని , ఇందులో ఎలాంటి అనుమానం లేదని జమ్మూ కాశ్మీర్ పోలీస్ వివరణ ఇచ్చింది.
అయితే భద్రతా లోపం కారణంగానే తాము భారత్ జోడో యాత్రను నిలిపి వేయాల్సి వచ్చిందని రాహుల్ గాంధీ, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారానికి తెర దించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. శనివారం యధావిధిగా యాత్ర కొనసాగింది. కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని అవంతి పోరా నుండి తిరిగి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) ప్రారంభమైంది.
ఉన్నట్టుండి అనంత్ నాగ్ జిల్లాలో పాదయాత్ర ముగిసింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభం కావడంతో పార్టీకి చెందిన నాయకులు, శ్రేణులు రాహుల్ గాంధీతో ఇవాళ జత కట్టారు. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ పరిపాలన విభాగం సరైన రీతిలో స్పందించ లేదని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ.
ఇదిలా ఉండగా అవంతి పొర మీదుగా సాగిన పాదయాత్రలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti) , ఆమె కూతురు ఇల్తిజా ముఫ్తీ , ఆమె పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా యాత్రలో చేరనున్నట్లు సమాచారం.
Also Read : వ్యోమగామి రాజా చారికి అరుదైన గౌరవం