LT General RP Kalita : సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్దం
భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే
LT General RP Kalita : చైనా సరిహద్దు వద్ద పరిస్థితి స్థిరంగా ఉందని స్పష్టం చేశారు చీఫ్ ఆర్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే. అయినా భారత్ పూర్తిగా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతోందని చెప్పారు. అయితే చైనా పదే పదే కవ్వింపు చర్యలకు దిగుతున్న క్రమంలో మనోజ్ పాండే చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇదిలా ఉండగా చీఫ్ ఆర్మీ స్టాఫ్ తూర్పు అరుణాచల్ ప్రదేశ్ లోని ఎల్ఏసీ వెంట ఉన్న భారత బలగాల ను సందర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా సరిహద్దు వెంట కార్యకలాపాలను సైన్యం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొనేందుకైనా భారత ఆర్మీ సిద్దంగా ఉందని ప్రకటించారు లెఫ్టినెంట్ జనరల్ కలితా(LT General RP Kalita) . భారత్ , చైనా మధ్య సరిహద్దు స్పష్టంగా నిర్వహించక పోవడం వల్ల మొత్తం సమస్య ఉత్పన్నమైందని అన్నారు.
వాస్తవ నియంత్రణ రేఖ గురించి భిన్నమైన అవగాహనలు ఉన్నాయని ,ఇది సమస్యలకు దారి తీస్తోందని పేర్కొన్నారు ఆర్మీ చీఫ్. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు సరిహద్దులో పరిస్థితి బాగానే ఉందన్నారు. కోల్ కతాలో జరిగిన మీడియా సమావేశంలో ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. గత ఏడాది 2022 డిసెంబర్ 9న తవాంగ్ సెక్టార్ లోని యాంగ్ట్సే వద్ద ఎల్ఏసీ వెంట ఇరు పక్షాల సైనికులకు ఘర్షణలకు దిగడంతో భారత్ ,చైనా దేశాల మధ్య ఉద్రికత్త నెలకొందన్నారు.
సరిహద్దు వెంట భారత సైన్యం సంసిద్ధత స్థాయి చాలా ఎక్కువగాఉందన్నారు. ఏ పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి సెక్టార్ లో తగిన బలగాలు ఉన్నాయని వెల్లడించారు.
Also Read : చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్