Governor CV Ananda Bose : ప‌శ్చిమ బెంగాల్ నా రెండో ఇల్లు

గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద బోస్

Governor CV Ananda Bose : ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద బోస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌శ్చిమ బెంగాల్ త‌న‌కు రెండో ఇల్లు లాంటిద‌ని అన్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు అన్నా వారు మాట్లాడే భాష అన్నా త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని స్ప‌ష్టం చేశారు గ‌వ‌ర్న‌ర్. త్వ‌ర‌లోనే తాను బెంగాలీ భాష‌ను నేర్చుకుంటాన‌ని అన్నారు సీవీ ఆనంద బోస్(Governor CV Ananda Bose) .

రాష్ట్ర రాజ‌ధాని కోల్ క‌తాలో గ‌ల రాజ్ భ‌వ‌న్ లో జ‌రిగిన హత్ ఖ‌రీ కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ , సీఎం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మ‌మతా బెన‌ర్జీ నుండి బ‌ర్న‌ప‌రిచయ్ పుస్త‌కాన్ని ఈ సంద‌ర్భంగా అందుకున్నారు. అంత‌కు ముందు గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద బోస్ ఆదివారం కోల్ క‌తా లోని ద‌క్షిణేశ్వ‌ర్ కాళీ ఆల‌యంలో ప్రార్థ‌న‌లు చేశారు.

ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. పూజారులు ఆశీర్వ‌చ‌నం అందించారు. అనంత‌రం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద బోస్ ప్ర‌సంగించారు. ప‌శ్చిమ బెంగాల్ సంస్కృతి అన్నా, ఇక్క‌డి నాగ‌రిక‌త అన్నా త‌న‌కు ఎంతో గౌర‌వం అని అన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రు బాగుండాల‌ని తాను కోరుకున్నాన‌ని చెప్పారు.

ఆల‌యాన్ని సంద‌ర్శించిన అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద బోస్(Governor CV Ananda Bose)  మీడియాతో మాట్లాడారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్ లో ఇక్క‌డ బాధ్య‌త‌లు తీసుకున్నా. కేంద్రం, రాష్ట్రం మ‌ధ్య స‌త్ సంబంధాలు నెల‌కొనేలా చూస్తున్నాన‌ని అన్నారు . బెంగాల్ సంస్కృతి, భాష గురించి నేర్చుకోవ‌డం ప్రాముఖ్య‌త‌ను నొక్కి చెప్పారు. ఇదిలా ఉండగా ప్ర‌తి ఏటా స‌ర‌స్వ‌తి పూజ నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా చేప‌డ‌తారు.

Also Read : భార‌త్..అమెరికా సంబంధాలు బాగా లేవు

Leave A Reply

Your Email Id will not be published!