PM Modi Man Ki Baat : పద్మ అవార్డు గ్రహీతలను చదవాలి
మన్ కీ బాత్ లో ప్రధాన మంత్రి మోడీ
PM Modi Man Ki Baat : ఈ దేశంలో అత్యున్నతమైన పురస్కారాలుగా పేరొందాయి పద్మ అవార్డులు. వివిధ రంగాలలో అత్యున్నతమైన సేవలు అందించిన వారు, ప్రతిభా పాటవాలతో సమాజాన్ని ప్రభావితం చేసిన వారు. దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలిచిన వారిని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పద్మ భూషణ్, పద్మ విభూషణ్ , పద్మశ్రీ పేరుతో పురస్కారాలను అందజేస్తోంది.
గత ఏడాది 2022 సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది 2023 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 106 మందిని ఎంపిక చేసింది మోదీ ప్రభుత్వం. ఈ సందర్బంగా మన్ కీ బాత్ రేడియో ప్రసంగం ద్వారా మోదీ(PM Modi Man Ki Baat) జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పద్మ అవార్డులు పొందిన వారి గురించి దేశ ప్రజలు తెలుసు కోవాలని కోరారు.
వారికి సంబంధించిన జీవితాలు, కథల గురించి ప్రత్యేకంగా చదవాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోడీ. 97వ ఎడిషన్ , 2023 సంవత్సరానికి సంబంధించి మొదటి మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం జనవరి 29న ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి.
ఈసారి పద్మ అవార్డు గ్రహీతలలో గణనీయమైన సంఖ్యలో గిరిజన సంఘాలు, గిరిజన సమాజంతో సంబంధం ఉన్న వ్యక్తుల నుండి వచ్చినట్లు ప్రధాని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాలకు చెందిన వివిధ వ్యక్తులు, చిత్రకారులు, సంగీతకారులు, రైతులు, కళాకారులు పద్మ పురస్కారాలు పొందారు.
దేశ ప్రజలంతా వారి స్పూర్తి దాయకమైన కథలను చదవాల్సిన అవసరం ఉందన్నారు ప్రధానమంత్రి. టోటో, హో, కుయ్, కువి, మందా వంటి గిరిజన భాషలపై కృషి చేసిన పలువురు ప్రముఖులు అవార్డులు అందుకున్నారని తెలిపారు మోడీ.
Also Read : ఒడిశా మంత్రిపై ఏఎస్ఐ కాల్పులు