Kerala Governor : నన్ను హిందువు అని పిలవండి – గవర్నర్
ఆరిఫ్ మహ్మద్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
Kerala Governor : కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ముస్లిం అని కాకుండా హిందూ అని పిలవండి అని కోరారు. అలీఘర్ ముస్లిం విశ్వ విద్యాలయం వ్యవస్థాపకుడిని ఈ సందర్భంగా ఉటంకించారు. నేను హిందువును అనడం తప్పు అనే భావన కలిగించేందుకు రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు కేరళ గవర్నర్.
తన వరకు హిందువును మత పరమైన పదంగా పరిగణించడం లేదని స్పష్టం చేశారు ఆరిఫ్ మహ్మద్ ఖాన్(Kerala Governor). శతాబ్ది కిందట తనను హిందువు అని పిలవాలని అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ వ్యవస్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మాటలను మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అందుకే తాను ఆయనను ఈ సదర్బంగా స్మరించు కుంటున్నట్లు తెలిపారు కేరళ గవర్నర్. కేరళ లోని తిరువనంతపురంలో జరిగిన హిందూ సమ్మేళనంలో గవర్నర్ మాట్లాడారు. మీరు నన్ను తప్పకుండా హిందువు అని పిలవాలని సర్ సయ్యద్ ఖాన్ నివేదించిన మాటలను పదే పదే ప్రస్తావించారు.
వలస పాలనలో లెజిస్లేటివ్ కౌన్సిల్ లో పదవీ కాలం పూర్తయినప్పుడు సయ్యద్ కు ఆర్య సమాజ్ సభ్యులు స్వాగతం పలికారని ఆరిఫ్ మహ్మద్ ఖాన్ చెప్పారు. అయితే ఆర్య సమాజ్ నిర్వాహకులకు ఈ సందర్భంగా ఓ ప్రశ్న వేశారు గవర్నర్ . మీరు ఎందుకు హిందువు అని పిలవడం లేదని ప్రశ్నించారు.
భారత దేశంలో జన్మించిన వారు ఎవరైనా సరే , ఈ నీటిని తాగే ఎవరైనా సరే హిందువు అని పలికేందుకు అర్హులు అని స్పష్టం చేశారు గవర్నర్.
Also Read : పేర్లు మారిస్తే సమస్యలు పరిష్కారం కావు