Team India Win Big Prize : విశ్వ విజేతకు భారీ నజరానా
రూ. 5 కోట్లు ..ఒక్కొక్కరికీ లక్ష
Team India Win Big Prize : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో మొదటిసారిగా దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించిన అండర్ -19 వరల్డ్ కప్ 2023 విజేతగా నిలిచింది భారత జట్టు. మొదట టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయం సరైనదేనని రుజువైంది.
ఇంగ్లండ్ జట్టును కేవలం 68 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. అనంతరం బరిలోకి దిగిన అమ్మాయిలు అదుర్స్ అనిపించేలా ఆడారు. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 14 ఓవర్లలో పని కానిచ్చేశారు.
విశ్వ విజేతలుగా అవతరించారు. క్రికెట్ కు పురిటి గడ్డగా భావించే ఇంగ్లండ్ అమ్మాయిలకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఏకంగా దిమ్మ తిరిగేలా జవాబు ఇచ్చారు. షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు ఇప్పుడు జగజ్జేతగా నిలిచింది. ఔరా అనేలా చేసింది. భారత దేశానికి చెందిన ప్రధాన మంత్రి నరేంద్ మోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో పాటు కోట్లాది మంది క్రీడాభిమానులు జేజేలు పలుకుతున్నారు.
ఇదిలా ఉండగా విశ్వ విజేతగా నిలిచిన అమ్మాయిలకు భారీ నజరానా(Team India Win Big Prize) దక్కింది. అండర్ 19 వరల్డ్ కప్ గెలిచినందుకు గాను మన జట్టుకు రూ. 5 కోట్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. మరో వైపు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఒక్కొక్కరికీ రూ. లక్ష బహుమతి ప్రకటించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ.
Also Read : టీమిండియా విశ్వ విజేత