Telangana Budget 2023 : తెలంగాణ బడ్జెట్ పై ఫోకస్
విద్యా రంగానికి కూడా ఎక్కువ నిధులు
Telangana Budget 2023 : త్వరలో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను రూపొందించే పనిలో పడింది. ఈసారి బడ్జెట్(Telangana Budget 2023) లో విద్య, ఆరోగ్య రంగానికి ప్రయారిటీ ఇవ్వనుంది. రాబోయే 12 నెలల్లో 9 మెడికల్ కళాశాలలు, 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు సిద్దం చేయనుంది. హైదరాబాద్ , వరంగల్ లో 9 కొత్తగా మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటుపై ఫోకస్ పెట్టనుంది.
ఈ రెండు రంగాలలో ప్రధానంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టనుంది సర్కార్. ఇదిలా ఉండగా తెలంగాణ వార్షిక ఆరోగ్య నివేదికను విడుదల చేసింది సర్కార్. గత ఏడాది కాలంలో సాధించిన విజయాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. బడ్జెట్ లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక శ్రద్ద పెడుతోంది.
ఈ ఏడాది 2023 ఆరోగ్య శాఖకు అత్యంత కీలకమని బీఆర్ఎస్ సర్కార్ పేర్కొంది. మరో వారం నుంచి 10 రోజుల్లో మొత్తం 1,147 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించనుంది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్ , జయశంకర్ భూపాలపల్లి, కుమురం భీం లోని 9 మెడికల్ కాలేజీలలో పోస్టింగ్ ఇవ్వనున్నారు.
మెడికల్ కాలేజీతో పాటు 10 నెలల్లో నిమ్స్ , వరంగల్ లోని హెల్త్ సిటీ, హైదరాబాద్ లోని నాలుగు స్పెషాలిటీ ఆస్పత్రుల విస్తరణతో సహా ఆరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను డెవలప్ చేయనుంది ప్రభుత్వం.
గతంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు ప్రస్తుత బడ్జెట్ కు(Telangana Budget 2023) తేడా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ తన్నీరు మంత్రి హరీష్ రావు.
Also Read : అఖిలపక్షంతో కేంద్రం కీలక భేటీ