IBM Layoffs : ఐబీఎం షాక్ 6 వేల మందిపై వేటు

సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ల‌లో గుబులు

IBM Layoffs : ఐటీ అంటేనే ఒక‌ప్పుడు ఓ రేంజ్ లో గౌర‌వం ఉండేది. కానీ రాను రాను ఐటీ సెక్టార్ అంటేనే జ‌డుసుకుంటున్నారు ఉద్యోగులు. ఆర్థిక మాంద్యం పేరుతో కొన్ని కంపెనీలు కొలువుల‌కు మంగ‌ళం పాడితే మ‌రికొన్ని కంపెనీలు కాస్ట్ క‌టింగ్ పేరుతో తొల‌గించే ప‌నిలో ప‌డ్డాయి. మొద‌ట టెస్లా సిఇఓ , చైర్మ‌న్ ట్విట్ట‌ర్ బిగ్ బాస్ ఎలోన్ మ‌స్క్ తీసి వేత‌కు మొద‌ట శ్రీ‌కారం చుట్టారు.

ఆయ‌న ఏకంగా ప‌ర్మినెంట్ , కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను 9 వేల మందికి పైగా తొల‌గించాడు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా టెక్ దిగ్గ‌జ కంపెనీలు మైక్రోసాఫ్ట్ , గూగుల్ , ఫేస్ బుక్ మెటా, ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ ఇలా చెప్పుకుంటూ పోతే 20 కి పైగా బిగ్ కంపెనీలు భారీ ఎత్తున తీసి వేశాయి. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 90 వేల‌కు పైగా ఉద్యోగుల‌ను తొలగించాయి.

తాజా మ‌రో ఐటీ కంపెనీ ఐబీఎం కోలుకోలేని షాక్ ఇచ్చింది. రాత్రికి రాత్రే ఎలాంటి స‌మాచారం లేకుండానే ఏకంగా 6,000 వేల మందికి మంగ‌ళం పాడింది(IBM Layoffs). ఇక నుంచి రావ‌ద్దంటూ ప్ర‌క‌టించింది. దీంతో ఉద్యోగులు ల‌బోదిబో మంటున్నారు. ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఏ స‌మ‌యంలో ఎలాంటి వార్త వినాల్సి వ‌స్తోంద‌న‌ని గ‌జ గ‌జ వ‌ణుకుతున్నారు.

టెక్ సెర్చింగ్ దిగ్గ‌జం ఏకంగా 12 వేల మందిని తొల‌గించింది. ఓ వైపు ఆయా కంపెనీల‌న్నీ తొల‌గింపు ప‌ర్వానికి శ్రీ‌కారం చుడితే జొమాటో మాత్రం 800 కు పైగా కొత్త జాబ్స్ కోసం నోటిఫికేష‌న్ జారీ చేసింది.

Also Read : అదానీని ఎదుర్కొనేందుకు సిద్దం

Leave A Reply

Your Email Id will not be published!