Elon Musk Focus : ట్విట్టర్ పై ఎలోన్ మస్క్ ఫోకస్
మరికొన్ని కంపెనీలపై బిజీ
Elon Musk Focus : టెస్లా కంపెనీ సిఇఓ , చైర్మన్ ఎలోన్ మస్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ట్విట్టర్ ను టేకోవర్ చేశాక ఆయనకు నిద్ర లేకుండా పోతోందట. దానిని గాడిలో పెట్టేందుకు నానా తంటాలు పడుతున్నానని పేర్కొన్నాడు ఎలోన్ మస్క్(Elon Musk). రూ. 4,400 కోట్ల భారీ ధరకు మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నాక కీలక మార్పులు తీసుకు వచ్చాడు. వచ్చీ రావడంతోనే టాప్ మేనేజ్ మెంట్ లోని వారందరినీ సాగనంపాడు.
ఆపై ఊహించని రీతిలో పర్మినెంట్, కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను ఊరబెరికాడు. అంతే కాదు ట్విట్టర్ లో ఉన్న అనవసర సామాన్లను కూడా వేలానికి పెట్టాడు. పని చేసే వాళ్లకు మాత్రమే ఛాన్స్ ఉంటుందని లేక పోతే నిర్దాక్షిణ్యంగా తీసి వేస్తానంటూ ప్రకటించాడు. అంతే కాదు మూడు నెలలు టైం ఇస్తున్నానని ఆతర్వాత పనితీరులో మార్పు రాక పోతే తీసి వేస్తానని హెచ్చరించారు.
దీంతో ట్విట్టర్ లో పనిచేస్తున్న వారంతా జంకుతున్నారు. ఎలాంటి తిండి కూడా పెట్టేది లేదంటూ ప్రకటించాడు. తాజాగా ఎలోన్ మస్క్(Elon Musk) ను కొందరు పిచ్చోడని అనుకుంటే పొరపాటు పడినట్లే . కీలకమైన సంస్కరణలకు తెర లేపాడు. ఆపై ట్విట్టర్ తో పాటు మరికొన్ని కంపెనీలను ఆయన పర్యవేక్షిస్తున్నారు.
మొత్తంగా ఒక్కసారి తాను టేకోవర్ చేసుకున్నాడంటే ఇక సదరు కంపెనీ సక్సెస్ కావాల్సిందే. తాను ప్రస్తుతం ఐదు కంపెనీలను నడుపుతున్నానని , నిద్ర లేని రాత్రుళ్లు గడుపుతున్నట్లు పేర్కొన్నాడు స్వయంగా. మొత్తంగా ట్విట్టర్ ను గాడిలో పెట్టే పనిలో ఉన్నాడు.
Also Read : ఫిలిప్స్ లో భారీగా ఉద్యోగుల తొలగింపు