Jagan Flight Return : జ‌గ‌న్ స్పెష‌ల్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం

గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్

Jagan Flight Return : ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌యాణిస్తున్న ప్ర‌త్యేక విమానంలో సాంకేతిక లోపం త‌లెత్తింది. లోపాన్ని వెంట‌నే గుర్తించారు పైల‌ట్. విష‌యం తెలిసిన వెంట‌నే ఫ్లైట్ ను తిరిగి దారి(Jagan Flight Return) మ‌ళ్లించారు. అక్క‌డి నుంచి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో ల్యాండ్ అయ్యేలా చేయ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండ‌గా ఫ్లైట్ టేకాఫ్ అయిన కొంత సేప‌టికే స్పెష‌ల్ విమానంలో సాంకేతిక లోపం ఉన్న‌ట్లు పైలట్ త‌క్ష‌ణ‌మే ప‌సిగ‌ట్టారు.

సోమవారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఏపీ సీఎం ప్ర‌త్యేక స‌మావేశం ఉండ‌డంతో ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్లాల్సి ఉంది. ఇందు కోసం ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ సిద్ద‌మైంది. సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెంట ఉన్న‌తాధికారులు కూడా ఉన్నారు. దీంతో సాంకేతిక లోపం త‌లెత్త‌డం, దానిని గుర్తించ‌డంతో ఢిల్లీ ప్ర‌యాణం క్యాన్సిల్ అయ్యింది.

పైల‌ట్ త‌క్ష‌ణ‌మే తిరిగి గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టు లో అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్(Jagan Flight Return) చేశారు. ఈ మొత్తం విమానానికి సంబంధించిన ప్ర‌యాణం సాయంత్రం 5.03 ల‌కు బ‌య‌లు దేరింది. తిరిగి సాయంత్రం 5 గంట‌ల 27 నిమిషాల‌కు గ‌న్న‌వ‌రంకు చేరుకుంది.

ఏపీ గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్లకు సంబంధించిన స‌మ్మిట్ జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ రెడ్డి హాజ‌రు కావాల్సి ఉంది. ఇందు కోసమే ఆయ‌న ఢిల్లీకి పయ‌న‌మయ్యారు. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోట‌ల్ లో దౌత్య‌వేత్త‌ల‌తో కూడా స‌మావేశం కావాల్సి ఉంది. గ‌న్న‌వ‌రంలో ల్యాండ్ అయిన వెంట‌నే జ‌గ‌న్ రెడ్డి వెంట‌నే తాడేప‌ల్లి గూడెంకు వెళ్లి పోయారు.

Also Read : గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై స‌ర్కార్ వెన‌క్కి

Leave A Reply

Your Email Id will not be published!